
ల్లూరు(సెంట్రల్): నెల్లూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ పరిశోధనా క్షేత్రంలోని పరిశోధనలు చాలా బాగున్నాయని, అమెరికాలోని టెన్నెసీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్స్ దిలీప్ నందు వాణి, ప్రొఫెసర్ జాన్ రికార్డ్స్ ప్రశంసించారు. నెల్లూరు నగరంలోని పరిశోధనా క్షేత్రాన్ని బుధవారం వారు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ పరిశోధనా స్థానాలను తాము పరిశీలించామని, అన్నిచోట్ల చాలా బాగున్నాయని కొనియాడారు. అదేవిధంగా నెల్లూరులో ఉన్న ఎన్‌జీ రంగా పరిశోధనా క్షేత్రంలో పరిశోధనలు తమకు ఎంతో సంతృప్తినిచ్చాయని వివరించారు.
తమ ప్రాంతంలో ఉన్న విద్యార్థులను కూడా నెల్లూరులోని పరిశోధనా క్షేత్రానికి పంపి ఇక్కడి స్థితిగతులను తెలుసుకునేలా చేస్తామన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కోదండరామిరెడ్డి, డాక్టర్ గురవారెడ్డి, డాక్టర్ సి.రమణ, ప్రధాన శాస్త్రవేత్త వినీత ఈ బృందానికి క్షేత్రంలో చేస్తున్న పరిశోధనలను వివరించారు. ప్రధానంగా కొత్త వంగడాలు, తెగుళ్ల నివారణపై కూలంకషంగా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment