
పరీక్ష ఫలితాను విడుదల చేస్తున్న ఇన్‌చార్జి వీసీ సూర్యకళావతి, రిజిస్ట్రార్ ఇ.సి. సురేంద్రనాథ్‌రెడ్డి
ఏఎఫ్‌యూ: కడపలోని డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్‌ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో 2021–22 బ్యాచ్ కాలేజి ఆఫ్ ఫైన్‌ఆర్ట్స్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్, ఆర్కిటెక్చర్ విద్యార్థుల ప్రథమ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం విశ్వవిద్యాలయంలో ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్ ఆచార్య మునగాల సూర్యకళావతి, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.సి. సురేంద్రనాథ్‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరీక్ష ఫలితాలను సకాలంలో విడుదల చేయడం పట్ల పరీక్షల విభాగం అధ్యాపకులు, సిబ్బందిని వారు అభినందించారు. కార్యక్రమంలో డిప్యూటీ రిజిస్ట్రార్ రాజేష్‌కుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్ వై. పవన్‌కుమార్‌రెడ్డి, పరీక్షల నిర్వహణ అధికారులు శ్రీలక్ష్మి, భారతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment