Semester exam results
-
వైఎస్సార్ ఏఎఫ్‌యూ సెమిస్టర్ ఫలితాలు విడుదల
ఏఎఫ్‌యూ: కడపలోని డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో 2021–22 బ్యాచ్ కాలేజి ఆఫ్ ఫైన్ఆర్ట్స్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్, ఆర్కిటెక్చర్ విద్యార్థుల ప్రథమ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం విశ్వవిద్యాలయంలో ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ ఆచార్య మునగాల సూర్యకళావతి, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.సి. సురేంద్రనాథ్‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరీక్ష ఫలితాలను సకాలంలో విడుదల చేయడం పట్ల పరీక్షల విభాగం అధ్యాపకులు, సిబ్బందిని వారు అభినందించారు. కార్యక్రమంలో డిప్యూటీ రిజిస్ట్రార్ రాజేష్‌కుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్ వై. పవన్‌కుమార్‌రెడ్డి, పరీక్షల నిర్వహణ అధికారులు శ్రీలక్ష్మి, భారతి తదితరులు పాల్గొన్నారు. -
సెమిస్టర్ ఫలితాలపై పెల్లుబికిన ఆగ్రహం
శ్రీకాకుళం, ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరి 26న విడుదలైన డిగ్రీ మొదటి, మూడు, ఐదు సెమిస్టర్ ఫలితాలపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్య మూల్యాంకనం, పరీక్షల నిర్వహణే కారణమని మండిపడ్డారు. మొదటి సెమిస్టర్లో 22,145 మంది పరీక్ష రాయగా, 7,439 మంది(39.59 శాతం), మూడో సెమిస్టర్లో 16,320 మందిగాను 5,660 మంది(34.68శాతం), ఐదవ సెమిస్టర్లో 10,112 మందికిగాను 4,625 మంది(45.74 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఈ నేపథ్యంలో బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ వీసీ కార్యాలయం ముందు గురువారం ఆందోళన చేపట్టారు. శ్రీకాకుళం పట్టణ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు ఇందులో పాల్గొని నిరసన తెలిపారు. వీసీ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. అదే సమయంలో పరీక్ష నిర్వహణ వాహనం వెళుతుండగా.. దానిని అడ్డుకున్నారు. వీసీ బయటకు రావాలని నినాదాలు చేశారు. విద్యార్థుల ధర్నా వద్దకు వీసీ కూన రామ్‌జీ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావు, ఎగ్జామినేషన్స్ డీన్ ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు చేరుకుని విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. పరీక్షలకు హాజరైనా కానట్లు చూపుతున్నారు మొదటి, రెండు సెమిస్టర్లలో పాస్ అయిన వారు ప్రస్తుతం ఫెయిల్ అయ్యారని, తొలి రెండు సెమిస్టర్లలో ఫెయిల్ అయిన వారు పాస్ అయ్యారని విద్యార్థులు వివరించారు. అన్ని పరీక్షలకు హాజరైనా హాజరు కానట్లు కొందరు విద్యార్థులకు చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికి ఐదు సెమిస్టర్లు పూర్తయిన విద్యార్థులకు మార్కుల జాబితా హార్డు కాపీలు అందలేదని తెలిపారు. ఫెయిల్ అయినట్లు చూపిస్తున్న విద్యార్థులకు.. తామకు ఎన్ని మార్కులు వచ్చాయనే విషయం తెలియడం లేదని పేర్కొన్నారు. కెమిస్ట్రీ, గణితం, ఫిజిక్స్, ఇంగ్లిష్, జువాలజీ పరీక్షలు మెరుగ్గా రాసినా ఫెయిల్ అయ్యామని వాపోయారు. మొత్తం జవాబు పత్రాలు మళ్లీ మూల్యాంకనం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై విద్యార్థులు, అధికారులతో వీసీ చర్చించారు. అకడమిక్ ఆడిట్ కమిటీ ఏర్పాటు విద్యార్థుల జవాబు పత్రాల పరిశీలనకు అకడమిక్ ఆడిట్ వేస్తామని వెల్లడించారు. పరీక్ష మెరుగ్గా రాసి ఫెయిల్ అయిన విద్యార్థులు ప్రిన్సిపాళ్లకు జాబితా ఇవ్వాలని సూచించారు. ఈ ప్రశ్నపత్రాల మూల్యాంకనంలో లోపాలు బయటపడితే.. అన్ని పశ్నపత్రాలు మూల్యాంకనం చేస్తామని తెలిపారు. ఇన్స్టెంట్, అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణ ఉన్నత విద్యామండలిపై అ«ధారపడిఉంటుందని, వారి దృష్టికి సమస్య తీసుకువెళతామన్నారు. విద్యార్థుల మార్కుల జాబితాల హార్డ్ కాపీలు పరీక్షలు పూర్తయిన వెంటనే కళాశాలలకు చేరేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు న్యాయం చేస్తామని స్పష్టంచేశారు. దీంతో విద్యార్థులు శాంతించి వెనుదిరిగారు. విద్యార్థులకు అఖిల భారత విద్యార్థిపరిషత్ జిల్లా సంఘటనా కార్యదర్శి తురకా ప్రసాద్ మద్దతు తెలిపారు. -
పత్తాలేని ఫస్ట్ సెమిస్టర్ ఫలితాలు
పూర్తరుున రెండో సెమిస్టర్ పరీక్షలు ఆరు నెలలు గడిచినా తప్పని నిరీక్షణ ఆందోళనలో ఎంకామ్ విద్యార్థులు కేయూక్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఎంకామ్ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాల విడుదలతో తీవ్ర జాప్యం చోటుచేసుకోవడంతో విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అరుుతే, వివిధ కోర్సుల పరీక్షలు సకాలంలో జరగకపోవడం ఫలితాల వెల్లడిపై ప్రభావం చూపుతోంది. అరుుతే, పరీక్షలు ముగిసి దాదాపు ఆర్నెల్లు గడిచినా ఫలితాలు వెలువడక పోవడానికి అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొంటున్నారు. మూడు జిల్లాలు.. నాలుగు వేల మంది విద్యార్థులు.. యూనివర్సిటీ పరిధిలోని వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో గల పీజీ కళాశాలలు, క్యాంపస్‌లో ఎంకామ్ మొదటి సెమిస్టర్ పరీ క్షలు ఈఏడాది జనవరి 17నుంచి 29వ తేదీ వరకు నిర్వహించారు. సుమారు నాలుగువేల మంది విద్యార్థులు హాజరయ్యూరు. అరుుతే, వాల్యూయేషన్‌లోనే అధికారులు జాప్యం చేస్తున్నారని విమర్శలు వస్తున్నారుు. పీజీ కోర్సుల్లో ఇంటర్నల్, ఎక్సటర్నల్‌గా రెండు దఫాలు జవా బు పత్రాల వాల్యూయేషన్ ప్రక్రియ చేపడతా రు. తొలిసారి ఇంటర్నల్‌గా కేయూలోని అధ్యాపకులు వాల్యూయేషన్ చేశాక ఎక్స్టర్నల్గా మరో యూనివర్సిటీ అధ్యాపకులతో వాల్యూయేషన్ చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ వి ద్యార్థుల్లో ఎవరికైనా ఒక సబ్జెక్టు పేపర్లో మొ దటి వాల్యూయేషన్‌లో వచ్చిన మార్కుల కం టే రెండో వాల్యూయేషన్‌కు మధ్య 19 మా ర్కుల తేడా ఉంటే ఆ సబ్జెక్టు పేపర్ జవాబుపత్రాన్ని థర్డ్ వాల్యూయేషన్ చేయిస్తారు. ఇలా ఎంకామ్‌లో 1700 జవాబుపత్రాలు థర్డ్ వా ల్యూయేషన్కు వెళ్లాయని తెలుస్తోంది. ఆ ప్ర క్రియ కూడా పూర్తియిందని తెలుస్తోంది. అ రుుతే, ఫలితాలు ఆలస్యం కావడంతో జవాబుపత్రాల వాల్యూయేషన్ ప్రక్రియ సక్రమంగా నిర్వర్తిస్తున్నారా? లేదా? అనే అనుమానాలు తలెత్తుతున్నారుు. ఏ కోర్సు పరీక్షల ఫలితాలై నా 40రోజుల్లో విడుదల చేయూలి. కానీ, ఎం కామ్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలు పరీక్షలు నిర్వహించిన ఆర్నెల్లు గడించినా విడుదల కావడంలేదు. ఇక రెండో సెమిస్టర్ పరీ క్షలు కూడా ఇటీవలే పూర్తియ్యాయి. వాస్తవం గా మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యూకే రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ 2014-2015విద్యాసంవత్సరంలో ఇప్పటికే రెండో సెమిస్టర్ పరీక్షలు కూడా ఆలస్యంగా ఇటీవల ముగిశా రుు. వాటి ఫలితాలు కూడా వెల్లడించాల్సి ఉం ది. ఇక ఆయా విద్యార్థులకు రెండో సంవత్సరంలో మూడో సెమిస్టర్ తరగతులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలే విడుదల కాకపోవబం, రెండో సెమిస ్టర్ పరీక్షలు ఇటీవల ముగియడంతో ఫలితాలు మరింత జాప్యమయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఎంకామ్ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల చేయూలని విద్యార్థులు కోరుతున్నారు.