పత్తాలేని ఫస్ట్ సెమిస్టర్ ఫలితాలు | First semester results are not invisible | Sakshi
Sakshi News home page

పత్తాలేని ఫస్ట్ సెమిస్టర్ ఫలితాలు

Published Sat, Aug 1 2015 1:58 AM | Last Updated on Sun, Sep 3 2017 6:31 AM

పత్తాలేని ఫస్ట్ సెమిస్టర్ ఫలితాలు

పత్తాలేని ఫస్ట్ సెమిస్టర్ ఫలితాలు

పూర్తరుున రెండో సెమిస్టర్ పరీక్షలు
 ఆరు నెలలు గడిచినా తప్పని నిరీక్షణ
ఆందోళనలో ఎంకామ్ విద్యార్థులు

 
 కేయూక్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఎంకామ్ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాల విడుదలతో తీవ్ర జాప్యం చోటుచేసుకోవడంతో విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అరుుతే, వివిధ కోర్సుల పరీక్షలు సకాలంలో జరగకపోవడం ఫలితాల వెల్లడిపై ప్రభావం చూపుతోంది. అరుుతే, పరీక్షలు ముగిసి దాదాపు ఆర్నెల్లు గడిచినా ఫలితాలు వెలువడక పోవడానికి అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొంటున్నారు.

 మూడు జిల్లాలు..  నాలుగు వేల మంది విద్యార్థులు..
యూనివర్సిటీ పరిధిలోని వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో గల పీజీ కళాశాలలు, క్యాంపస్‌లో ఎంకామ్ మొదటి సెమిస్టర్ పరీ క్షలు ఈఏడాది జనవరి 17నుంచి 29వ తేదీ వరకు నిర్వహించారు. సుమారు నాలుగువేల మంది విద్యార్థులు హాజరయ్యూరు. అరుుతే, వాల్యూయేషన్‌లోనే అధికారులు జాప్యం చేస్తున్నారని విమర్శలు వస్తున్నారుు. పీజీ కోర్సుల్లో ఇంటర్నల్, ఎక్సటర్నల్‌గా రెండు దఫాలు జవా బు పత్రాల వాల్యూయేషన్ ప్రక్రియ చేపడతా రు. తొలిసారి ఇంటర్నల్‌గా కేయూలోని అధ్యాపకులు వాల్యూయేషన్ చేశాక ఎక్స్‌టర్నల్‌గా మరో యూనివర్సిటీ అధ్యాపకులతో వాల్యూయేషన్ చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ వి ద్యార్థుల్లో ఎవరికైనా ఒక సబ్జెక్టు పేపర్‌లో మొ దటి వాల్యూయేషన్‌లో వచ్చిన మార్కుల కం టే రెండో వాల్యూయేషన్‌కు మధ్య 19 మా ర్కుల తేడా ఉంటే ఆ సబ్జెక్టు పేపర్ జవాబుపత్రాన్ని థర్డ్ వాల్యూయేషన్ చేయిస్తారు. ఇలా ఎంకామ్‌లో 1700 జవాబుపత్రాలు థర్డ్ వా ల్యూయేషన్‌కు వెళ్లాయని తెలుస్తోంది. ఆ ప్ర క్రియ కూడా పూర్తియిందని తెలుస్తోంది. అ రుుతే, ఫలితాలు ఆలస్యం కావడంతో జవాబుపత్రాల వాల్యూయేషన్ ప్రక్రియ సక్రమంగా నిర్వర్తిస్తున్నారా? లేదా? అనే అనుమానాలు తలెత్తుతున్నారుు. ఏ కోర్సు పరీక్షల ఫలితాలై నా 40రోజుల్లో విడుదల చేయూలి. కానీ, ఎం కామ్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలు పరీక్షలు నిర్వహించిన ఆర్నెల్లు గడించినా విడుదల కావడంలేదు.

ఇక రెండో సెమిస్టర్ పరీ క్షలు కూడా ఇటీవలే పూర్తియ్యాయి. వాస్తవం గా మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యూకే రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ 2014-2015విద్యాసంవత్సరంలో ఇప్పటికే రెండో సెమిస్టర్ పరీక్షలు కూడా ఆలస్యంగా ఇటీవల ముగిశా రుు. వాటి ఫలితాలు కూడా వెల్లడించాల్సి ఉం ది. ఇక ఆయా విద్యార్థులకు రెండో సంవత్సరంలో మూడో సెమిస్టర్ తరగతులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలే విడుదల కాకపోవబం, రెండో సెమిస ్టర్ పరీక్షలు ఇటీవల ముగియడంతో ఫలితాలు మరింత జాప్యమయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఎంకామ్ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల చేయూలని విద్యార్థులు కోరుతున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement