సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగుల పక్షాన ఉద్యమకార్యాచరణ చేపట్టిన కాంగ్రెస్ పార్టీ సోమవారం ఖమ్మంలో భారీసభ నిర్వహించనుంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీతోపాటు టెన్త్ పరీక్షల లీకేజీ, ఉద్యోగ నియామకాల్లో ప్రభు త్వ నిర్లక్ష్యం, విద్యార్థి వ్యతిరేక విధానాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలలో జాప్యం తదితర అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ నిరసనసభలు నిర్వహించాలని ఇప్పటికే కాంగ్రెస్ నిర్ణయించింది. అందులో భాగంగా ఖమ్మ ంలో తొలిసభ జరగనుంది.
ఈ సభ సందర్భంగా సోమవా రం సాయంత్రం 4 గంటలకు ఖమ్మంలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్ నుంచి మయూరి సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహిస్తామని టీపీసీసీ తెలిపింది. సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు సీనియర్ నేతలు పాల్గొంటారని, కాంగ్రెస్ కార్యకర్తలు, నిరుద్యోగులు, విద్యార్థులు ఈ సభకు భారీగా తరలిరావాలని టీపీసీసీ పిలుపునిచ్చింది.
27న కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని తొలగించినందుకు నిరసనగా ఈనెల 27న గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష నిర్వహించనున్నట్టు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. దీక్షలో సంఘటన్ జాతీయ అధ్యక్షురాలు మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ నేతలు దీక్షలో పాల్గొంటారని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment