
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో తాజాగా మరొకరు అరెస్ట్ అయ్యారు. న్యూజిలాండ్ నుంచి వచ్చిన వ్యక్తిని సీసీఎస్/సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 100 మందికి చేరింది.
సిట్ అధికారులు అరెస్ట్ చేసిన వారిలో అధిక మంది విద్యార్ధులే ఉండటం గమనార్హం. వీరందరిపై ఐపీసీలోని 381, 409, 420, 411, 120 (బీ), 201తో పాటు ఐటీ యాక్ట్‌లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
చదవండి: మంత్రి సబిత గన్‌మెన్ ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment