
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/శాతవాహన విశ్వవిద్యాలయం: శాతవాహన విశ్వవిద్యాలయంలోని ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానికి సంబంధించిన వాట్సాప్ గ్రూపులపై పోలీసులు దృష్టిసారించారు. ఈ వ్యవహారంలో సూత్రధారులను గుర్తించేందుకు సీజ్ చేసిన తొమ్మిది మొబైల్ ఫోన్లను సైబర్ ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపించడంతో ఆయా కళాశాలలకు, వాట్సాప్ గ్రూపులకు చెందిన వారిలో కలవరం మొదలైంది.విచారణలో కొన్ని కొత్త వాట్సాప్ గ్రూపులు, మరింత అదనపు సమాచారం రావడంతో వారందరికీ నోటీసులు పంపిస్తూ ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.