
స్టార్ కమెడియన్, బాలీవుడ్ నటుడు కపిల్ శర్మ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. డిసెంబరులో తన గర్ల్‌ఫ్రెండ్ జిన్నీని కపిల్ వివాహమాడనున్నట్లు అతడి సన్నిహితులు మీడియాకు తెలిపారు. ‘అమృత్‌సర్‌లో పంజాబీ సంప్రదాయంలో, నాలుగు రోజుల పాటు కపిల్ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా బీ- టౌన్ సెలబ్రిటీలంతా పంజాబ్ చేరుకుంటారని చెప్పడానికి ఎంతో సంతోషంగా ఉంది. పెళ్లి తంతు ముగిసిన తర్వాత ముంబైలో కపిల్ రిసెప్షన్ పార్టీ ఉంటుందని’ వారు పేర్కొన్నారు.
కాగా ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ షోతో ఫేమస్ అయిన కపిల్ శర్మ స్టార్ కమెడియన్‌గా గుర్తింపు పొందాడు. ఒక షోకు అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న కమెడియన్‌గా కూడా రికార్డు సృష్టించాడు. పలు బాలీవుడ్ సినిమాలలో కూడా నటించిన కపిల్.. ‘సన్ ఆఫ్ మంజీత్ సింగ్’ అనే సినిమాతో నిర్మాతగా మారాడు. ఈ సినిమా అక్టోబరు 12న విడుదల కానుంది. ఇక జిన్నీతో తనకున్న అనుబంధాన్ని 2017లో ట్విటర్ వేదికగా కన్ఫామ్ చేసిన కపిల్ త్వరలోనే ఆమెను పెళ్లాడనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment