
ఈ నెల 12న తన చిరకాల స్నేహితురాలు గిన్ని చరాత్‌తో ఏడడుగులు వేయనున్నాడు.
బాలీవుడ్‌లో ఈ ఏడాది పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. నిన్న మొన్నటి వరకు దీప్‌వీర్, ప్రియానిక్‌ల వివాహ వేడుకలతో బిజీగా ఉన్న బీ- టౌన్ సెలబ్రిటీస్ మరో గ్రాండ్ వెడ్డింగ్‌కు సిద్ధమవుతున్నారు. స్టార్ కమెడియన్ కపిల్ శర్మ పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 12న తన చిరకాల స్నేహితురాలు గిన్ని చరాత్‌తో ఏడడుగులు వేయనున్నాడు. అయితే దీప్‌వీర్, ప్రియానిక్‌ల పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలు రెండు రోజుల వరకు బయటకు రాకపోవడంతో అభిమానులు నిరాశ చెందిన విషయం తెలిసిందే. ఇందుకు భిన్నంగా కపిల్ తన అభిమానుల కోసం యూట్యూబ్ చానల్‌లో పెళ్లి వేడుకను లైవ్‌స్ట్రీమింగ్ చేయనున్నాడు. పెళ్లి కంటే ఒకరోజు ముందుగానే అంటే డిసెంబరు 11 నుంచే లైవ్‌స్ట్రీమింగ్ మొదలుకానుంది. ‘కపిల్ శర్మా కీ షాదీ హై!! పూరే ఇండియా కో ఆనా హై’ (కపిల్ శర్మ పెళ్లికి భారత్ మొత్తం రావాలి)పేరిట ‘కపిల్ పెళ్లి పిలుపు’లకు సంబంధించిన వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. దీంతో కపిల్ పెళ్లి కోసం పంజాబ్‌కు వెళ్లాల్సిన పని లేకుండానే హాయిగా ఎక్కడ ఉన్నా సరే పెళ్లి వేడుక వీక్షించవచ్చు అంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా అత్యంత సన్నిహితుల మధ్య కపిల్ పెళ్లి వేడుక పంజాబీ సంప్రదాయ ప్రకారం జరుగనుంది. ఇందుకు సంబంధించిన వేడుకలు ఇప్పటికే మొదలయ్యాయి కూడా. ఇక హోం టౌన్ అమృత్‌సర్‌లో డిసెంబరు 14న సన్నిహితుల కోసం, ముంబైలో డిసెంబరు 24న ఇండస్ట్రీ ప్రముఖుల కోసం.. కపిల్ రెండు రిసెప్షన్ పార్టీలు ఇవ్వనున్నాడు.