
ముంబై: అదిరిపోయే టైమింగ్‌తో నవ్వులు పూయించే కపిల్ శర్మ ఆ మధ్య కొంచెం బొద్దుగా మారిపోయాడు. దానివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తటంతో బరువు తగ్గాడట. ఈ విషయాన్ని కపిల్ తన అతిథి హీరో గోవిందా (ఛీ ఛీ గారు)తో పంచుకుంటుండగా, కామెడీ షోలకి జడ్జిగా వ్యవహరించే అర్చనా పురాణ్ సింగ్ తీసిన వీడియోలను ఇతరులతో పంచుకోవటంతో ఇది బయటపడింది. తరువాత స్పందించిన కపిల్ శర్మ కేవలం కొన్ని వారాల వ్యవధిలో డాక్టర్‌ల సలహా మేరకు 11 కేజీలు తగ్గానని వెల్లడించాడు. నడుము కింద డిస్క్ సమస్యలు తలెత్తటంతో బరువు తగ్గక తప్పలేదన్నారు.
బరువు తగ్గడంతో తన బృందం ఆనందపడ్డారని తెలిపాడు. తను బరువు తగ్గడానికి చేస్తున్న వ్యాయామ వీడియోలను ఇన్‌స్టాలో పంచుకున్నారు. తన కుటుంబంతో జరుపుకున్న దీపావళి ఫోటోలను కూడా పంచుకున్నారు. దాంట్లో తన భార్య గిన్ని, పిల్లలు అన్రయా, కవల పిల్లలు, తల్లి ఉన్నారు. అయితే బరువు తగ్గిన విషయాన్ని సైతం ఛలోక్తులు విసరడానికి వాడుకున్నాడు. వెబ్ సిరీస్ కోసం తాను సన్న బడాల్సి వచ్చిందని, అందంగా ఆరోగ్యంగా కనిపించడానికి ఇలా అయ్యానని గోవిందతో చమత్కరించారు.
గోవిందా కూతురు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ 92 కిలోల నుంచి 81 కిలోల వరకు తగ్గానని చెప్పుకొచ్చారు. గోవింద సైతం తన ఫిట్‌నెస్‌ను చూపించగా ,ఇద్దరూ రాక్ స్టార్‌లుగా ఒకే వేదికపై కనిపిస్తున్నారని అర్చన కితాబునిచ్చారు. తన కూతురు మన మాటలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయాడానికి మధ్యలో కల్పించుకుంటుందని, మనం ఇక్కడ నుంచి వెళదామని గోవిందా అనగా, అర్చన ఖర్చుతో అంటూ కపిల్ చణుకులు విసిరారు. కపిల్ నిర్వహించిన ఈ షోలో ఎప్పుడూ కనిపించే గోవిందా మేనల్లుడు కృష్ణా అభిషేక్ ఈసారి మాత్రం కనిపించలేదు. వీరిద్దరికీ కుటుంబ వివాదాలు ఉండటంతో కనిపించలేదని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment