govindaa
-
11 కేజీల బరువు తగ్గిన ‘కామెడీ కింగ్’
ముంబై: అదిరిపోయే టైమింగ్‌తో నవ్వులు పూయించే కపిల్ శర్మ ఆ మధ్య కొంచెం బొద్దుగా మారిపోయాడు. దానివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తటంతో బరువు తగ్గాడట. ఈ విషయాన్ని కపిల్ తన అతిథి హీరో గోవిందా (ఛీ ఛీ గారు)తో పంచుకుంటుండగా, కామెడీ షోలకి జడ్జిగా వ్యవహరించే అర్చనా పురాణ్ సింగ్ తీసిన వీడియోలను ఇతరులతో పంచుకోవటంతో ఇది బయటపడింది. తరువాత స్పందించిన కపిల్ శర్మ కేవలం కొన్ని వారాల వ్యవధిలో డాక్టర్ల సలహా మేరకు 11 కేజీలు తగ్గానని వెల్లడించాడు. నడుము కింద డిస్క్ సమస్యలు తలెత్తటంతో బరువు తగ్గక తప్పలేదన్నారు. బరువు తగ్గడంతో తన బృందం ఆనందపడ్డారని తెలిపాడు. తను బరువు తగ్గడానికి చేస్తున్న వ్యాయామ వీడియోలను ఇన్‌స్టాలో పంచుకున్నారు. తన కుటుంబంతో జరుపుకున్న దీపావళి ఫోటోలను కూడా పంచుకున్నారు. దాంట్లో తన భార్య గిన్ని, పిల్లలు అన్రయా, కవల పిల్లలు, తల్లి ఉన్నారు. అయితే బరువు తగ్గిన విషయాన్ని సైతం ఛలోక్తులు విసరడానికి వాడుకున్నాడు. వెబ్ సిరీస్ కోసం తాను సన్న బడాల్సి వచ్చిందని, అందంగా ఆరోగ్యంగా కనిపించడానికి ఇలా అయ్యానని గోవిందతో చమత్కరించారు. గోవిందా కూతురు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ 92 కిలోల నుంచి 81 కిలోల వరకు తగ్గానని చెప్పుకొచ్చారు. గోవింద సైతం తన ఫిట్నెస్ను చూపించగా ,ఇద్దరూ రాక్ స్టార్లుగా ఒకే వేదికపై కనిపిస్తున్నారని అర్చన కితాబునిచ్చారు. తన కూతురు మన మాటలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయాడానికి మధ్యలో కల్పించుకుంటుందని, మనం ఇక్కడ నుంచి వెళదామని గోవిందా అనగా, అర్చన ఖర్చుతో అంటూ కపిల్ చణుకులు విసిరారు. కపిల్ నిర్వహించిన ఈ షోలో ఎప్పుడూ కనిపించే గోవిందా మేనల్లుడు కృష్ణా అభిషేక్ ఈసారి మాత్రం కనిపించలేదు. వీరిద్దరికీ కుటుంబ వివాదాలు ఉండటంతో కనిపించలేదని తెలిసింది. -
సంజయ్ దత్ చెప్పాడనే చేశా!
బాలీవుడ్ నటుడు, మాజీ ఎంపీ గోవిందా హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా అవతార్‌లో నటించమని జేమ్స్ కామెరూన్ తనను అడిగాడని మొన్న సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ దర్శకుడు డేవిడ్ దావన్‌పై వివాదాస్పద వాఖ్యలు చేశాడు. 1989లో గోవింద, డేవిడ్ దావన్ దర్శకత్వంలో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో 17 సినిమాలు వచ్చాయి. వీటిలో చాలా హిట్ అయ్యాయి. వీరి కాంబినేషన్లో వచ్చిన చివరి చిత్రం పార్ట్నర్. సల్మాన్, గోవింద హీరోలుగా 2007లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయం సాదించింది. ఆ తర్వాత ఇప్పటి వరకు గోవిందా, డేవిడ్ కలిసి సినిమా చేయలేదు. ఈ విషయంపై గోవింద ఇండియా టుడేతో జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను రాజకీయాల నుంచి తప్పుకున్నాక ఒకరోజు నా సెక్రటరీతో డేవిడ్‌కు ఫోన్ చేయించి స్పీకర్ ఆన్ చేయమన్నాను. అవతలి నుంచి డేవిడ్ స్పందిస్తూ ‘‘చీచీ (గోవింద నిక్‌నేమ్) చాలా ప్రశ్నలు అడుగుతాడు. నేను అతనితో పని చేసే ప్రసక్తే లేదు. చిన్న చిన్న పాత్రలు చేసుకోమని చెప్పమన్నాడు’’. అతని సమాధానంతో నేను షాకయ్యాను. ఆ తర్వాత నాలుగైదు నెలల తర్వాత అతని సినిమాల్లో అతిథి పాత్రలు చేయాలని మళ్లీ ఫోన్ చేశాను. కానీ అతను స్పందించలేదు. అతను ఇదివరకు నాకు తెలిసిన డేవిడ్ కాడు. అతని మీద వేరే వారి ప్రభావమేదో ఉండి ఉండొచ్చు. అయితే ఇది జరిగి చాలా రోజులైంద’ని తెలిపాడు. ఇంకో ప్రశ్నకు సమాధానమిస్తూ ‘తోటి పంజాబీకి పని కల్పించమనే సంజయ్‌దత్ సూచన మేరకు నేను, డేవిడ్‌తో 17 సినిమాలు చేశాను. ఒకవేళ నా సోదరులు డైరెక్టర్‌గా ఉన్నా కూడా వారితో అన్ని సినిమాలు చేసేవాడిని కాదు. అంతెందుకు ఇప్పుడు వరుణ్ ధావన్ (డేవిడ్ ధావన్ కొడుకు) కూడా వాళ్ల నాన్నతో ఇన్ని సినిమాలు చేయలేడ’’ని చెప్పాడు. -
తిరుమలలో భక్తులను ఇలాగే పిలవాలి..
- భక్తులను 'గోవిందా..' అని సంబోధించాలన్న టీటీడీ చైర్మన్, ఈవోలు తిరుచానూరు : శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను గోవిందా అని సంబోధించాలని టీటీడీ చెర్మైన్ చదలవాడ కృష్ణమూర్తి శ్రీవారి సేవకులకు సూచించారు. బ్రహ్మోత్సవాల్లో సేవలందించేందుకు దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ నుంచి 2,750మంది శ్రీవారి సేవకులు, 600మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ వచ్చారు. భక్తులతో ఎలా వ్యవహరించాలి, సేవలు ఎలా అందించాలి వంటి వాటిపై బుధవారం తిరుమల ఆస్థానమండపంలో వీరికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చెర్మైన్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావించి నిస్వార్థ సేవలందిస్తున్న శ్రీవారి సేవకుల జన్మ ధన్యమని తెలిపారు. 15ఏళ్ళ క్రితం 195మంది సేవకులతో ప్రారంభమైన శ్రీవారి సేవలో ఇప్పటి వరకు సుమారు 6.38లక్షల మంది సేవలందించారని తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరగాలని కోరారు. భక్తుల మన్ననలు పొందేలా సేవలందించాలని కోరారు. కలియుగ వైకుంఠమైన తిరుమలలో సేవలందించడం శ్రీవారి సేవకుల పూర్వజన్మ సుకృతమని తెలిపారు. అనంతరం ఈవో డాక్టర్ డి.సాంబశివరావు మాట్లాడుతూ ధర్మప్రచారానికి రథసారధులు శ్రీవారి సేవకులని తెలిపారు. తిరుమలలో సేవా విధులతో పాటు ధర్మప్రచారంలో భాగంగా నిర్వహించే మనగుడి, శుభప్రదం, రథయాత్రలు, శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు, గోపూజ వంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రీవారి సేవకులను కోరారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అందుతున్న సేవలపై శ్రీవారి సేవకులతో సర్వేలు నిర్వహించి, లోపాలున్న చోట నాణ్యమైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే కొన్ని చోట్ల దళారి వ్యవస్థను అరికట్టేందుకు శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకుంటున్నట్లు చెప్పారు. ఇటీవల 5లడ్డూ ప్రసాదం కౌంటర్ల వద్ద శ్రీవారి సేవకులు సేవలందించారని, వారి సేవలకు విశేష స్పందన వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ కమిషనర్ శశిధర్, డీపీపీ కార్యదర్శి ప్రయాగ రామకృష్ణ, టీటీడీ విద్యాశాఖాధికారి విజయకుమార్, పీఆర్వో టి.రవి, ఏపీఆర్వో పి.నీలిమ తదితరులు పాల్గొన్నారు.