సునీల్‌ షాక్‌: కపిల్‌ షో టీఆర్పీ డౌన్‌ఫాల్‌ | Kapil sharma show 100th episode: Sunil Grover interesting comment | Sakshi
Sakshi News home page

సునీల్‌ షాక్‌: కపిల్‌ షో టీఆర్పీ డౌన్‌ఫాల్‌

Published Tue, Apr 25 2017 6:01 PM | Last Updated on Tue, Sep 5 2017 9:40 AM

సునీల్‌ షాక్‌: కపిల్‌ షో టీఆర్పీ డౌన్‌ఫాల్‌

సునీల్‌ షాక్‌: కపిల్‌ షో టీఆర్పీ డౌన్‌ఫాల్‌

ముంబై: సహ నటులతో అహంకారపూరితంగా వ్యవహరించిన స్టాండప్‌ కమెడియన్ కపిల్‌ శర్మపై విమర్శలు వెల్లువెత్తడమేకాదు, టీవీ షో 'ది కపిల్‌ శర్మ షో(టీకేఎస్‌)' టీఆర్పీ రేటింగ్ అంతకంతకూ దిగజారుతోంది. సునీల్‌ గ్రోవర్‌(డాక్టర్‌ మషూర్‌ గులాటీ, రింకూ పాత్రధారి) గౌర్హాజరీతో క్రమంగా పాపులారిటీ తగ్గిపోతోన్న కపిల్‌ శర్మ షో ఆదివారం 100వ ఎపిసొడ్‌ను పూర్తిచేసుకుంది.

ఇదే సందర్భంపై సునీల్‌ గ్రోవర్‌ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీకేఎస్‌ 100 ఎపిసొడ్స్‌ పూర్తైన సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూనే ఆ షోలోకి తిరిగి వచ్చేదిలేదని మరోసారి స్పష్టం చేశాడు. అంతేనా, అతి త్వరలోనే కొత్త పని మొదలుపెట్టబోతున్నట్లు ప్రత్యర్థులకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పాడు.

’కపిల్‌ షో ప్రసారమయ్యే సోనీ టీవీలోనే నేను మరో షో ప్రారంభించబోతున్నట్లు చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటివరకు అలాంటి ఒప్పందాలేవీ జరగలేదు. సోనీయేకాదు ఏ ఇతర చానెల్‌లోనూ షోలకు సైన్‌ చేయలేదు. కానీ అతి త్వరలోనే కొత్త పని మొదలుపెడతా. బేసిగ్గా నేను పెర్ఫార్మన్‌ను కాబట్టి ఆ పని చేయకుండా ఉండలేను’ అని సునీల్‌ గ్రోవర్‌ మీడియాతో అన్నాడు. ’మీరు లేని కారణంగానే కపిల్‌ శర్మ షో రేటింగ్ పడిపోయిందనుకుంటున్నారా?’ అన్న ప్రశ్నకు మాత్రం మౌనమే సమాధానం అంటూ చిరునవ్వు చిందించాడు కమెడియన్‌.

ఇక ఆదివారం నాటి 100వ ఎపిసొడ్‌లో.. హైవేలపై మద్యం దుకాణాల నిషేధంపై మాట్లాడిన కపిల్‌ శర్మ.. విమానాల్లోనూ లిక్కర్‌ బ్యాన్‌ చేయాలి వ్యాఖ్యానించాడు. ఆ మధ్య మెల్‌బోర్న్‌ నుంచి ముంబై బలుదేరిన విమానంలో ఫుల్లుగా మందుకొట్టిన కపిల్‌.. సహనటుడు సునీల్‌ గ్రోవర్‌ను ’నువ్వు నా పనివాడివి..’అంటూ తీవ్రంగా దూషించి, చేయిచేసుకున్న సంగతి తెలిసిందే. ఆ దెబ్బతో సునీల్‌.. కపిల్‌ శర్మ షో నుంచి బయటికి వచ్చేయడం, ఘటనపై కపిల్‌ ట్విట్టర్‌లో పలుమార్లు క్షమాపణలు చెప్పినా సునీల్‌ వెనక్కి తగ్గకపోవడం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement