నటి శిల్పా షిండే సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్టార్ భారత్ కొత్త కామెడీ షో ‘గ్యాంగ్స్ ఆఫ్ ఫిల్మిస్తాన్’ నుంచి తాను తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ షో ఇంకా టీవీలో టెలికాస్ట్ కాకముందే శిల్పా షిండే ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. ‘సాస్ బహు ఔర్ బేటియాన్’ నిర్వహించిన ఒక ప్రత్యేక చాట్‌లో శిల్ప తన నిర్ణయాన్ని వెల్లడించారు. అంతేకాక సునీల్ గ్రోవర్ వల్లే తాను ఈ షో నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నేను ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే.. ఈ షో కోసం నేను ఎంతో కష్టపడ్డాను. ఎంతో హార్డ్ వర్క్ చేసిన తర్వాత కూడా నన్ను కేవలం బ్యాక్‌గ్రౌండ్‌కే పరిమితం చేస్తున్నారు. అంతేకాక కరోనా సమయంలో కూడా మేం రోజుకు 12-15 గంటల పాటు షూటింగ్ చేస్తున్నాము. ఎక్కువ పని గంటలు కష్టపడ్డా కూడా సరైన ప్రతిఫలం లభించడం లేదు’ అన్నారు శిల్పా షిండే. (చదవండి: టీవీలకు అతుక్కుపోయే టైమ్ వచ్చేసింది)
అంతేకాక ‘గతంలో మాట్లాడలేదు.. కానీ ఇప్పుడు దీని గురించి మాట్లాడక తప్పని పరిస్థితి. మా షిఫ్ట్ ప్రతి రోజు ఉదయం 7 గంటలకు మొదలై రాత్రి 11 గంటలకు ముగుస్తుంది. నిర్మాతలు తమ నటులను అర్థం చేసుకోవాలి. మేం పని వాళ్లం కాదు. మీరు నటులను దోపిడీ చేయలేరు’ అన్నారు శిల్పా షిండే. అంతేకాక తాను షో నుంచి తప్పుకోవడానికి సగం కారణం సునీల్ గ్రోవరే అన్నారు శిల్పా షిండే. ఆమె మాట్లాడుతూ.. ‘యాభై శాతం నా సమస్య సునీల్ గ్రోవర్‌తోనే. ఈ షో ప్రమోషన్‌లో వారు నా పేరు వాడుకున్నారు. కానీ ప్రోమోలో కేవలం సునీల్‌ని మాత్రమే చూపిస్తున్నారు. ఇదే కాదు ప్రతి యాక్ట్‌లో కేవలం సునీల్‌ని మాత్రమే చూపిస్తున్నారు. మాకు కేవలం ఒక లైన్ మాత్రమే ఇస్తున్నారు. సునీల్‌కి సూచనలు ఇవ్వడానికి మేం ఇక్కడ లేము’ అన్నారు శిల్పా షిండే. అంతేకాక ఈ షోను కపిల్ శర్మ షోతో పోల్చుతూ.. మరిన్ని ఆరోపణలు చేశారు. (చదవండి: నా కుటుంబానికి ఇది కష్ట కాలం: నటుడు)
‘కపిల్ శర్మ షో చూడండి.. అక్కడ ప్రతి ఒక్కరికి స్పేస్ ఉంటుంది. అందరికి సమాన అవకాశం లభిస్తుంది. ఎవరూ ఖాళీగా నిలబడి ఉండరు. ప్రతి ఒక్కరికి స్వంత గుర్తింపు ఉంటుంది. కానీ ఇక్కడ అంతా సునీల్ గ్రోవరే. అలాంటప్పుడు వారు షో పేరును ‘సునీల్ గ్రోవర్ షో’గా ఎందుకు మార్చకూడదూ’ అంటూ శిల్పా షిండే ప్రశ్నలు కురిపించారు. అంతేకాక తాను తన ఒక్క దాని కోసం మాత్రమే కాక అందరి కోసం మాట్లాడుతున్నాను అన్నారు శిల్పా షిండే. ఇక ఈ ఆరోపణలపై షో నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment