విమాన ప్రమాదంలో చనిపోయారని చెప్పారు..షాకయ్యాను : కాజోల్‌ | Kajol Reveals The Strangest Rumor About Her In Kapil Sharma Show | Sakshi
Sakshi News home page

విమాన ప్రమాదంలో చనిపోయారని చెప్పారు..షాకయ్యాను : కాజోల్‌

Oct 29 2024 11:54 AM | Updated on Oct 29 2024 12:09 PM

Kajol Reveals The Strangest Rumor About Her In Kapil Sharma Show

సినీ తారలపై పుకార్లు రావడం సాధారణం. అయితే సినిమాల పరంగా వచ్చే గాసిప్స్‌ కొంతవరకు పర్వాలేదు. కానీ పర్సనల్‌ విషయాల్లోనూ లేనిపోని వార్తలు రావడంతో ఇబ్బందికరమే. అలాంటి ఇబ్బందులను చాలా ఎదుర్కొన్నాను అంటోంది అందాల తార కాజోల్‌. ఆమె నటించిన తాజా చిత్రం ‘దో పత్తి’. మిస్టరీ థ్రిల్లర్‌ నేపథ్యంలో విడుదలైన ఈ చిత్రం ఈ నెల 25న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదలైన మంచి టాక్‌ సంపాదించుకుంది. 

ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆమె ‘ది కపిల్‌ శర్మ షో’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాజోల్‌ తన సీనీ కెరీర్‌ గురించి  పలు కీలక విషయాలను వెల్లడించారు. తనపై చాలా గాసిప్స్‌ వచ్చాయని..ఒకనొక సమయంలో తాను చనిపోయినట్లు కూడా వార్తలు రాశారని, వాటిని చూసి షాకయ్యానని చెప్పారు.

‘నాపై చాలా రూమర్స్‌ వచ్చాయి. పర్సనల్‌ విషయాల్లోనూ పుకార్లు రాశారు. ఓ సారి గుర్తుతెలియని వ్యక్తి మా అమ్మకు ఫోన్‌ చేసి ‘విమాన ప్రమాదంలో మీ కూతురు చనిపోయారు’అని చెప్పాడు. ఇంట్లోవాళ్లు చాలా కంగారు పడ్డారు. ఆ మధ్య కూడా నేను చనిపోయినట్లు యూట్యూబ్‌లో వీడియోలు పెట్టారు. అయితే ఇలాంటివి నేను పెద్దగా పట్టించుకోను. ఏదైనా ఇబ్బందికర వార్తలు రాస్తే..నా ఫ్రెండ్స్‌ నాకు పంపిస్తుంటారు. వాటిని చదివి ఇలా ఎలా రాస్తారు? అనుకుంటాను. అంతేకానీ పెద్దగా పట్టించుకోను’అని కాజోల్‌ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement