జాన్వీకి రెండుసార్లు ఫుడ్ పంపించా.. కానీ: ఎన్టీఆర్ | NTR, Janhvi Kapoor, Saif Ali Khan In Kapil Sharma's Show Latest | Sakshi
Sakshi News home page

NTR Janhvi Kapoor: జాన్వీ కపూర్.. ఒక్కతే వండుకునే తినేది

Published Sat, Sep 28 2024 11:08 AM | Last Updated on Sat, Sep 28 2024 11:22 AM

NTR, Janhvi Kapoor, Saif Ali Khan In Kapil Sharma's Show Latest

'దేవర' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. మొన్నటివరకు ప్రమోషన్స్ చేసి తెగ అలసిపోయారు. దాదాపు ఇంటర్వ్యూలన్నీ ఇప్పటికే ప్రసారం అయిపోగా.. 'ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో' మాత్రం పెండింగ్‌లో ఉండిపోయింది. తాజాగా శనివారం సాయంత్రం 8 గంటలకు స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: 'దేవర' పార్ట్ 2లో స్టోరీ ఏం ఉండొచ్చు?)

ఈ షోలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ పాల్గొన్నారు. ప్రోమోనే ఫుల్ ఆన్ ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. ఎపిసోడ్ వేరే రేంజులో ఉంటుందని చెప్పకనే చెప్పినట్లయింది. ఇకపోతే ప్రోమోలోనే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని చూపించారు. 'దేవర' షూటింగ్ కోసం జాన్వీ హైదరాబాద్ వస్తే ఎన్టీఆర్ రెండుసార్లు ఫుడ్ పంపించాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా బయటపెట్టాడు.

కానీ జాన్వీ కపూర్ మాత్రం తనకు తానుగా ఫుడ్ వండుకునేదని, నాకు మాత్రం కొంచెమైనా పెట్టేది కాదని ఎన్టీఆర్ చెప్పాడు. దీంతో జాన్వీ నవ్వేసింది. అలానే 'ఆర్ఆర్ఆర్' ఇంటర్వెల్ సీన్‌లో తాను నిజమైన జంతువులు ఉన్న ట్రక్‌లో చాలా సేపు ఉన్నానని జనాలు అనుకుంటున్నారని, అది గ్రాఫిక్స్ అని చెప్పినా సరే నమ్మట్లేదని తారక్ చెప్పుకొచ్చాడు. 

(ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement