
నిబంధనలు ఒప్పుకుంటే ఓకే: అమరీందర్
కమెడియన్ కపిల్ శర్మ వ్యాఖ్యాతగా ఉండే టీవీ సిరీస్‌లో పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్ సిద్ధూ కొనసాగడాన్ని.. రాజ్యాంగ నిబంధనలు అనుమతిస్తే తనకేం ఇబ్బందీ లేదని ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్
న్యూఢిల్లీ: కమెడియన్ కపిల్ శర్మ వ్యాఖ్యాతగా ఉండే టీవీ సిరీస్‌లో పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్ సిద్ధూ కొనసాగడాన్ని.. రాజ్యాంగ నిబంధనలు అనుమతిస్తే తనకేం ఇబ్బందీ లేదని ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ స్పష్టంచేశారు. ఒకవేళ చట్టంలోని నిబంధనలు ఇందుకు విరుద్ధంగా ఉంటే రాష్ట్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ నుంచి సిద్ధూను మార్చుతానని అమరీందర్ చెప్పారు. ‘ఈ విషయమై రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అతుల్ నందాను అభిప్రాయం కోరాం. ఆయనింకా ఈ విషయాన్ని పరిశీలించలేదు’ అని అన్నారు. మంత్రి హోదాలో ఓ టీవీ షోలో సిద్ధూ కొనసాగడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే, తన కుటుంబ ఖర్చుల కోసం, తన అభిరుచి మేరకే టీవీ సిరీస్‌లో కొనసాగుతానని సిద్ధూ ప్రకటించారు.