Bollywood Comedian Kapil Sharma Spotted In Wheelchair At Mumbai Airport - Sakshi
Sakshi News home page

బాగానే ఉన్నాను.. అందరికీ థాంక్స్‌: కపిల్‌ శర్మ

Published Tue, Feb 23 2021 3:40 PM | Last Updated on Tue, Feb 23 2021 5:41 PM

Kapil Sharma Says Reason Why He Was In Wheelchair In Airport - Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటుడు, స్టార్‌ కమెడియన్‌ కపిల్‌ శర్మ వీల్‌చైర్‌లో ఉన్న ఫొటోలు వైరల్‌ కావడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. కపిల్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తూ ఇప్పటికే సోషల్‌ మీడియాను జల్లెడ పట్టేస్తున్నారు. అత్యంత ఆదరణ పొందిన కామెడీ షో ‘ది కపిల్‌ శర్మ షో’కు విరామం ఇస్తున్నట్లు కపిల్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. తన భార్య గిన్నీ చరాత్‌ రెండో బిడ్డకు జన్మనివ్వనుండటంతో ఆమెకు దగ్గరగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఇక ఈ జంట ఫిబ్రవరి 1న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ శుభవార్తను కూడా కపిల్‌ అభిమానులతో పంచుకున్నాడు.

వీల్‌చైర్‌లో కపిల్‌: ఫొటో కర్టెసీ: వైరల్‌ భయానీ

అంతా సక్రమంగా సాగుతుందనుకున్న వేళ ముంబై ఎయిర్‌పోర్టులో కపిల్‌ వీల్‌చైర్‌లో దర్శనమివ్వడంతో ఫ్యాన్స్‌ కలవరానికి గురయ్యారు. ఈ విషయంపై తాజాగా స్పందించిన కపిల్‌.. ‘‘నేను బాగానే ఉన్నాను. జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్నపుడు వీపు భాగంలో గాయమైంది. త్వరగానే కోలుకుంటాను. నా యోగక్షేమాలు తెలుసుకుంటూ నాపై ఇంత ప్రేమ కురిపిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నాడు. కాగా బుల్లితెరపై ఒక షోకు అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న వ్యక్తిగా కూడా కపిల్‌ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక 2018 డిసెంబరులో తన చిరకాల స్నేహితురాలు గిన్నీ చరాత్‌ను పెళ్లి చేసుకోగా‌.. ఈ దంపతులకు 2019లో కుమార్తె అనైరా శర్మ జన్మించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement