
కపిల్ షో నుంచి సిద్ధూ ఔట్.. ఎందుకు?
ముంబై: తన కామెడీ నైట్ షో నుంచి కామెడీ గరు నవజ్యోత్‌సింగ్ సిద్దూ తప్పుకున్నాడంటూ వచ్చిన వార్తలపై కపిల్ శర్మ స్పందించాడు. సిద్ధూ స్థానంలో అర్చనా పురాణ్ సింగ్ షోలోకి రానుందని బాలీవుడ్ గుసగుసలు రావడంతో దీనిపై కపిల్ శర్మ స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది. గతంలో మాదిరి పరిస్థితుల దృష్ట్యా కొద్దికాలం మాత్రమే కామెడీ నైట్‌షోకు దూరంగా ఉంటారని కపిల్ శర్మ తెలిపాడు.
ప్రముఖ హిందీ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన ఈ విషయం స్పష్టం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తన షోనుంచి సిద్ధూ తప్పుకున్నాడని వచ్చిన వార్తల్లో నిజంలేదని, అది అసత్య వార్త అన్నారు. గతంలో సైరాత్ ఎపిసోడ్‌కు సిద్ధూ అందుబాటులో లేకపోతే జాకీచాన్‌తోపాటు, రవీనాజీలు షోలో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇది పూర్తిగా నిరాధారమైన వార్త అని కపిల్‌శర్మ తెలిపారు.
కపిల్‌శర్మ, నవజ్యోత్ సింగ్ సిద్ధూలు కలర్స్ ఛానల్‌లో షో ప్రారంభం నుంచి కలిసి పనిచేస్తున్నారు. అనంతరం ఇద్దరూ సోని ఛానల్‌కు మారిపోయారు. ఇప్పుడు తాజాగా సిద్ధూ స్థానంలో అర్చన సింగ్ అలరించలేదని, కపిల్ శర్మకు, సిద్ధూ మధ్య ఉన్న ర్యాపోను మెయింటన్ చేయలేకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి. అయితే గత ఏడాది చివర్లో కూడా సిద్ధూ షోనుంచి తప్పుకున్నాడు. పంజాబ్ ఎన్నికల సమయంలో కొద్దిరోజుల పాటు కపిల్‌శర్మ షోలో పాల్గొనలేదు.