archana puran singh
-
సెలబ్రిటీల జాబితాలో నటి పనిమనిషి!
ప్రముఖ బాలీవుడ్ నటి అర్చన పురాన సింగ్ ఇంటి పని మనిషి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్న అర్చన ఇంట్లో తన భర్త, కుటుంబ సభ్యులతో సరదాగా గుడుపుతున్నారు. ఈ క్రమంలో తన ఇంటి పని మనిషి భాగ్యశ్రీ ఫన్నీ వీడియోలను తరచూ సోషల్ మీడియాలో పంచుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా మరో వీడియోను అర్చన తన ఇన్స్టాగ్రామ్ శుక్రవారం షేర్ చేశారు. పని మనిషి భాగ్యశ్రీ పని చేస్తూ.. ఒక్కసారిగా గట్టిగా నవ్వడంతో.. ఎందుకు నవ్వావని అర్చన అడిగారు. వెంటనే భాగ్యశ్రీ టీవీలో వస్తున్న జోక్‌కి నవ్వాను అని చెప్పిన ఈ వీడియోకు ‘చాకచక్య సమాధానం..! భాగ్యశ్రీ రాక్స్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు.(సుసానే సోదరికి కరోనా నెగిటివ్.. కానీ!) View this post on Instagram Hazir jawaab! #bhagyashrirocks #lockdown2020 #madhislandlife A post shared by Archana Puran Singh (@archanapuransingh) on Apr 16, 2020 at 11:48pm PDT ఇక ‘‘ఎలాంటి పరిస్థితోనైనా భాగ్యశ్రీ ఎప్పుడూ సంతోషంగా ఉండటానికే ప్రయత్నిస్తుంది. దానికి కారణం ఏంటి అని ఎప్పుడూ అడిగినా.. మీ హ్యాపీ ఫ్యామిలీలో భాగమైనందు వల్లే తాను సంతోషంగా ఉన్నాను అని సమాధానం ఇస్తుంది’’ అంటూ అర్చన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఇక ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అవును ‘భాగ్యశ్రీ రాక్స్’ అని మరికొదంరు ‘ఇక అర్చన పని మనిషి ఇక సోషల్ మీడియా సెలబ్రిటీల జాబితాలో చేరిపోతుంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. -
కపిల్ షో నుంచి సిద్ధూ ఔట్.. ఎందుకు?
ముంబై: తన కామెడీ నైట్ షో నుంచి కామెడీ గరు నవజ్యోత్‌సింగ్ సిద్దూ తప్పుకున్నాడంటూ వచ్చిన వార్తలపై కపిల్ శర్మ స్పందించాడు. సిద్ధూ స్థానంలో అర్చనా పురాణ్ సింగ్ షోలోకి రానుందని బాలీవుడ్ గుసగుసలు రావడంతో దీనిపై కపిల్ శర్మ స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది. గతంలో మాదిరి పరిస్థితుల దృష్ట్యా కొద్దికాలం మాత్రమే కామెడీ నైట్షోకు దూరంగా ఉంటారని కపిల్ శర్మ తెలిపాడు. ప్రముఖ హిందీ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన ఈ విషయం స్పష్టం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తన షోనుంచి సిద్ధూ తప్పుకున్నాడని వచ్చిన వార్తల్లో నిజంలేదని, అది అసత్య వార్త అన్నారు. గతంలో సైరాత్ ఎపిసోడ్‌కు సిద్ధూ అందుబాటులో లేకపోతే జాకీచాన్‌తోపాటు, రవీనాజీలు షోలో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇది పూర్తిగా నిరాధారమైన వార్త అని కపిల్‌శర్మ తెలిపారు. కపిల్‌శర్మ, నవజ్యోత్ సింగ్ సిద్ధూలు కలర్స్ ఛానల్లో షో ప్రారంభం నుంచి కలిసి పనిచేస్తున్నారు. అనంతరం ఇద్దరూ సోని ఛానల్‌కు మారిపోయారు. ఇప్పుడు తాజాగా సిద్ధూ స్థానంలో అర్చన సింగ్ అలరించలేదని, కపిల్ శర్మకు, సిద్ధూ మధ్య ఉన్న ర్యాపోను మెయింటన్ చేయలేకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి. అయితే గత ఏడాది చివర్లో కూడా సిద్ధూ షోనుంచి తప్పుకున్నాడు. పంజాబ్ ఎన్నికల సమయంలో కొద్దిరోజుల పాటు కపిల్‌శర్మ షోలో పాల్గొనలేదు.