
ప్రముఖ బాలీవుడ్ నటి అర్చన పురాన సింగ్ ఇంటి పని మనిషి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్న అర్చన ఇంట్లో తన భర్త, కుటుంబ సభ్యులతో సరదాగా గుడుపుతున్నారు. ఈ క్రమంలో తన ఇంటి పని మనిషి భాగ్యశ్రీ ఫన్నీ వీడియోలను తరచూ సోషల్ మీడియాలో పంచుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా మరో వీడియోను అర్చన తన ఇన్‌స్టాగ్రామ్ శుక్రవారం షేర్ చేశారు. పని మనిషి భాగ్యశ్రీ పని చేస్తూ.. ఒక్కసారిగా గట్టిగా నవ్వడంతో.. ఎందుకు నవ్వావని అర్చన అడిగారు. వెంటనే భాగ్యశ్రీ టీవీలో వస్తున్న జోక్‌కి నవ్వాను అని చెప్పిన ఈ వీడియోకు ‘చాకచక్య సమాధానం..! భాగ్యశ్రీ రాక్స్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు.(సుసానే సోదరికి కరోనా నెగిటివ్.. కానీ!)
ఇక ‘‘ఎలాంటి పరిస్థితోనైనా భాగ్యశ్రీ ఎప్పుడూ సంతోషంగా ఉండటానికే ప్రయత్నిస్తుంది. దానికి కారణం ఏంటి అని ఎప్పుడూ అడిగినా.. మీ హ్యాపీ ఫ్యామిలీలో భాగమైనందు వల్లే తాను సంతోషంగా ఉన్నాను అని సమాధానం ఇస్తుంది’’ అంటూ అర్చన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఇక ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అవును ‘భాగ్యశ్రీ రాక్స్’ అని మరికొదంరు ‘ఇక అర్చన పని మనిషి ఇక సోషల్ మీడియా సెలబ్రిటీల జాబితాలో చేరిపోతుంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment