నో మేకప్.. నథింగ్!
ఎప్పుడూ గ్లామర్ డాల్ పాత్రలేనా? ఛాన్స్ వస్తే డీ-గ్లామర్‌గానూ కనిపిస్తా. మేకప్ లేకుండా నటించడానికి నేను రెడీ! - పలు సందర్భాల్లో తమన్నా చెప్పిన డైలాగ్ ఇది. తమిళ సినిమా ‘ధర్మదురై’లో అటువంటి పాత్రను పోషించారామె. కాటన్ చీరల్లో ఎటువంటి మేకప్ లేకుండా డాక్టర్ పాత్రలో తమన్నా నటించారు. ఇప్పుడీ సినిమా ‘ధర్మరాజు ఎం.బి.బి.ఎస్.’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది. విజయ్ సేతుపతి హీరో. నిర్మాత జె.సాంబశివరావు విడుదల చేస్తున్నారు. వైద్యవృత్తిని పవిత్రంగా భావించే ఓ యువకుడికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఆ సమస్యలను ఎలా అధిగమించాడనేది చిత్రకథ. ప్రస్తుతం డబ్బింగ్ జరుగుతోంది. యువన్ శంకర్ రాజా స్వరపరిచిన పాటల్ని త్వరలో రిలీ జ్ చేయనున్నారు.
నిజం కాదు... ‘కామెడీ నైట్స్ విత్ కపిల్ శర్మ’, ‘ద కపిల్ శర్మ షో’లతో హిందీలో పాపులర్ అయిన కపిల్ శర్మ సరసన తమన్నా ఓ సినిమాలో నటించనున్నారని సోమవారం ఓ వార్త హల్‌చల్ చేసింది. చివరకు తమన్నా రంగంలోకి దిగి ఆ వార్తను ఖండించాల్సి వచ్చింది. ‘‘నేను ఏదైనా సినిమా ఒప్పుకుంటే, నేనే చెబుతా. ఇలాంటి పుకార్లను ఎంకరేజ్ చేయవద్దు’’ అని ట్వీట్ చేశారు.