మా కొట్లాట దేశ రక్షణ అంశమా: కమెడియన్‌ | Kapil Sharma Describes Alleged Fight With Sunil Grover As 'Family Matter,' Admits They Argued | Sakshi
Sakshi News home page

మా కొట్లాట దేశ రక్షణ అంశమా: కమెడియన్‌

Published Mon, Mar 20 2017 6:11 PM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM

మా కొట్లాట దేశ రక్షణ అంశమా: కమెడియన్‌ - Sakshi

మా కొట్లాట దేశ రక్షణ అంశమా: కమెడియన్‌

సహనటుడిపై విమానంలో దాడి చేయడంపై బాలీవుడ్‌ టాప్‌ కమెడియన్‌ కపిల్‌ శర్మ మౌనం వీడారు. సునీల్‌ గ్రోవర్‌ తన సోదరుడు లాంటి వాడని.. ఏదైనా సమస్య ఉంటే ఇరువురూ చర్చించుకుని సరిదిద్దుకుంటామని తెలిపారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు చేశారు. విమానంలో సునీల్‌పై చేయి చేసుకున్నట్లు ఒప్పుకున్నారు. అయితే, అది వారి సమస్య అని మీడియా మధ్యలో ఎందుకు జోక్యం చేసుకుందని ప్రశ్నించారు.

కొంతమంది పనిగట్టుకుని తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సునీల్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని, గౌరవం కూడా ఉందని చెప్పారు. ఐదేళ్లలో తొలిసారి సునీల్‌పై కోపగించుకున్నట్లు తెలిపారు. కేవలం ఆర్టిస్టుగా మాత్రమే కాకుండా మనిషిగా కూడా సునీల్‌ గొప్పవారని పేర్కొన్నారు కపిల్‌. కానీ, తనపై నెగిటివ్‌ వార్తలు రావడం బాధిస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. మీడియాపై తనకు గౌరవం ఉందని చెప్పారు.

సునీల్‌, తాను గొడవపడితే అంతలా ప్రచారం చేయడానికి అదేమైనా దేశ రక్షణకు సంబంధించిన విషయమా? అని ప్రశ్నించారు. సునీల్‌ తన కుటుంబంలో ఒకరని చెప్పారు. కుటుంబంలో చిన్నాచితకా సమస్యలు వస్తుంటాయని అన్నారు. కాగా, విమానంలో తన సీటులో సునీల్‌ గ్రోవర్‌ కూచుని ఉండగా.. కపిల్‌ ఆకస్మికంగా ఆయన వద్దకు వచ్చి తిట్లదండకాన్ని షురూ చేశారు. సునీల్‌ను కాలర్‌ పట్టుకొని లేపి.. అతన్ని కొట్టారనే వార్తలు వచ్చిన తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement