కపిల్ షాక్! | shock of kapil! | Sakshi
Sakshi News home page

కపిల్ షాక్!

Mar 1 2015 12:03 AM | Updated on Sep 2 2017 10:05 PM

కపిల్ షాక్!

కపిల్ షాక్!

ఏంటో ఈ మధ్య బాలీవుడ్ స్టార్ హీరోలను టీవీ తారలు పెద్దగా లెక్క చేయడం లేదు! మొన్నీమధ్య అభిషేక్‌బచ్చన్‌తో ఓ షోలో కనిపించడానికి ఇద్దరు టీవీ స్టార్ నటీమణులు నో చెప్పారు

ఏంటో ఈ మధ్య బాలీవుడ్ స్టార్ హీరోలను టీవీ తారలు పెద్దగా లెక్క చేయడం లేదు! మొన్నీమధ్య అభిషేక్‌బచ్చన్‌తో ఓ షోలో కనిపించడానికి ఇద్దరు టీవీ స్టార్ నటీమణులు నో చెప్పారు. ఆ తరువాత షారూఖ్‌తో ఎపిసోడ్‌లో తన అప్పియరెన్స్ కుదరదంటూ మరో బుల్లి తెర భామ తెగేసి చెప్పింది.
 
 తాజాగా షారూఖ్‌కే మరో షాక్! ‘కామెడీ విత్ కపిల్’తో బాగా పాపులర్ అయిన కపిల్‌శర్మ... షారూఖ్ ఆఫర్‌ను కాదన్నాడట! బాలీవుడ్ బాద్‌షా యాంకర్‌గా లాంచ్ అవుతున్న న్యూ గేమ్ షో ‘ఇండియా పూచేగా సబ్‌సే షానా కౌన్’లో గెస్ట్‌గా కనిపించేందుకు కపిల్ కుదరదన్నాడనేది ఓ వెబ్‌సైట్ కథనం. అయితే ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ను టెలీకాస్ట్ చేస్తున్న కలర్స్ యాజమాన్యం తమ కాంపిటీటివ్ ప్రోగ్రామ్‌లో కనిపించవద్దంటూ ఆర్డర్ పాస్ చేసిందట. కానీ... ఈ విషయాన్ని సదరు చానల్ ప్రతినిధులు ఖండిస్తున్నారు. కనిపించాలా... వద్దా అన్నది కపిల్ వ్యక్తిగత వ్యవహారమంటూ కొట్టిపారేశారట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement