క్షమాపణ చెప్పిన టాప్ కమెడియన్ | Kapil Sharma Apologises To Sunil Grover After Alleged Fight | Sakshi
Sakshi News home page

క్షమాపణ చెప్పిన టాప్ కమెడియన్

Published Tue, Mar 21 2017 11:55 AM | Last Updated on Tue, Sep 5 2017 6:42 AM

క్షమాపణ చెప్పిన టాప్ కమెడియన్

క్షమాపణ చెప్పిన టాప్ కమెడియన్

ముంబై: సహనటుడు సునీల్ గ్రోవర్ పై విమానంలో దాడి చేసిన ఘటనలో బాలీవుడ్‌ టాప్‌ కమెడియన్‌ కపిల్‌ శర్మ క్షమాపణ చెప్పాడు. సునీల్ గ్రోవర్ ను బాధ పెట్టివుంటే క్షమించాలని వేడుకున్నాడు. ఉద్దేశపూర్వకంగా దాడి చేయలేదని తెలిపాడు.

‘అనుకోకుండా నేను చేసిన పనికి నువ్వు బాధ పడివుంటే నన్ను క్షమించు. నేను నిన్ను ఎంతగా అభిమానిస్తానో నీకు తెలుసు. జరిగిన ఘటన నన్ను కూడా బాధించింది. నిన్నేప్పుడు అభిమానిస్తూనే ఉంటాన’ని కపిల్ శర్మ ట్వీట్ చేశాడు. మద్యం మత్తులో సునీల్ గ్రోవర్ పై విమానంలో కపిల్ శర్మ దాడి చేయడంతో వివాదం రేగింది.

కపిల్ చర్య తనను ఎంతగానో బాధించిందని సునీల్ వాపోయాడు. మహిళ ముందు తనను తీవ్రంగా అవమానించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. సాటి మనుషుల పట్ల గౌరవం కలిగివుండాలని, దేవుడిలా నటించొద్దని కపిల్ శర్మకు హితవు పలికారు. అయితే కపిల్ క్షమాపణను సునీల్ అంగీకరిస్తాడా, లేదా అనేది చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement