ఆ కమెడియన్ ఇల్లు పూర్తిగా ఇల్లీగలే!
దీంతో ఈ అక్రమ నిర్మాణం వ్యవహారంలో పలు వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. కపిల్ శర్మ నివాసముంటున్న బిల్డింగ్ పూర్తిగా అక్రమమైనదని తాజాగా దాని ఇరుగుపొరుగువారు ఆరోపించారు. అంధేరిలోని ఫోర్ బంగ్లాస్ ఏరియాలో ఉన్న కపిల్ శర్మ బంగ్లాను పూర్తిగా చట్టవిరుద్ధంగా కట్టారని వారు చెప్తున్నారు. అయతే, బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు మాత్రం కపిల్ శర్మ తన బంగ్లాలో పలు అక్రమ నిర్మాణాలు చేపట్టారని, ఇందుకు పత్రాలతో సహా ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. కాగా, కపిల్ బంగ్లా విషయంలో తాము కోర్టు ఆశ్రయించాలని భావిస్తున్నట్టు స్థానిక కోఆపరేటివ్ సోసైటీ చైర్మన్ అనురాగ్ పఠాక్ మీడియాకు తెలిపారు.