Kapil Sharma Reaction On Rumours About Issue With Akshay Kumar, Deets Inside - Sakshi
Sakshi News home page

Akshay Kumar-Kapila Sharma: అక్షయ్‌తో వివాదం ఉన్నమాట నిజమే.. కానీ

Published Fri, Feb 11 2022 3:10 PM | Last Updated on Fri, Feb 11 2022 3:57 PM

Kapil Sharma Respond On Rumours Over Rift Between Him And Akshay Kumar - Sakshi

Kapil Sharma Gave Clarity On Rift Between Him And Akshay: బాలీవుడ్‌ మోస్ట్‌ పాపులర్‌ కమెడియన్‌లో నటుడు కపిల్‌ శర్మ ఒకరు. కమెడీ నైట్‌ విత్‌ కపిల్‌ శర్మ షో ఆయన ఎంతో పాపులర్‌ అయ్యారు. సినీ సెలబ్రెటీలతో చిట్‌చాట్‌ నిర్వహించి తనదైన కామెడీ పంచ్‌లతో కడుపుబ్బా నవ్విస్తుంటాడు. అందుకే కమెడియన్‌లో కపిల్‌ శర్మ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. బాలీవుడ్​లో ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్​ అయినా కపిల్​ షోకి వచ్చి ప్రమోట్​ చేసుకోవాల్సిందే అన్నంత రేంజ్​లో కపిల్​ విజయం సాధించాడు. ఈ నేపథ్యంలో తన సినిమాల ప్రమోషన్లో భాగంగా బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ గతంలో పలుమార్లు ఈ షోలో పాల్గొన్నారు.

చదవండి: Trolls On Kajal Aggarwal: కాజల్‌ బాడీపై ట్రోల్స్‌.. మద్దుతుగా నిలిచిన సమంత, లక్ష్మి మంచు

ఈ క్రమంలో ఈ  షోలో జరిగిన ఓ ఘటనపై అక్షయ్‌, కపిల్‌పై కోపంగా ఉన్నాడని, అందుకే తన తాజా చిత్రం బచ్చన్‌ పాండే ప్రమోషన్‌ కోసం ఈ షోకు రావడం లేదంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ వివాదం బాగా ముదరడంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు కూడా వచ్చాయంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో వారిద్దరిపై వస్తున్న వార్తలపై రిసెంట్‌గా కపిల్‌ శర్మ స్పందిస్తూ వివరణ ఇచ్చాడు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘అక్షయ్‌కి నాకు మధ్య విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలను చూశాను. అవును మా మధ్య చిన్నపాటి డిస్టబెన్స్‌ వచ్చింది. కానీ అప్పుడే దానిపై అక్షయ్‌తో మాట్లాడాను. సమచార లోపంతోనే ఇది జరిగింది. ఆ వెంటనే అక్షయ్‌కి ఫోన్‌ చేసిన మాట్లాడి వివరణ ఇచ్చాను. ఇప్పుడు అంతా సర్థుకుంది.

చదవండి: రణ్‌బీర్‌తో నాకు పెళ్లయిపోయింది.. బయటపెట్టిన ఆలియా 

త్వరలోనే ఆయన బచ్చన్‌ పాండే ప్రమోషన్‌ కోసం మా షోలో సందడి చేయనున్నారు, అక్షయ్‌ నాకు పెద్దన్నలాంటివారు. ఆయన ఎప్పుడు నాపై కోపంతో ఉండరు’ అంటూ వివరణ ఇచ్చారు. కాగా ఇటీవల ఆత్రంగి రే మూవీ ప్రమోషన్స్‌ కోసం అక్షయ్‌ కుమార్‌ కపిల్‌ శర్మ షోకు వచ్చారు. ఈ సందర్భంగా అక్షయ్‌ గతంలో ప్రధాని నరేంద్ర మోదీని ఇంటర్వ్యూలో చేయడంపై కపిల్‌ ఈ షో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆ ఇంటర్య్వూలో కపిల్‌ పలు సరదా ప్రశ్నలు వేసి అక్షయ్‌ని ఆటపట్టించారు. అయితే ఇది ఎడిటింగ్‌లో తీసేయాలని అక్షయ్‌ చెప్పడంలో షో నిర్వహకులు ఒకే అన్నారు. కానీ తీరా చూస్తూ ఈ సన్నీవేశాలు అనుకొకుండా నెట్టింట లీక్‌ అయ్యాయి.  దీంతో ఈ వ్యవహరంలోనే అక్షయ్‌, కపిల్‌పై కోపంగా ఉన్నారని సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement