
హీరోయిన్ ను పెళ్లాడిన కపిల్ శర్మ!
కామెడీ కింగ్ కపిల్ శర్మ కోరుకున్న కల నెరవేరింది. అతడిని పెళ్లి చేసుకునేందుకు బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలెస్ ఫెర్నాండెజ్ అంగీకరించింది. అయితే ఇదంతా నిజంగా జరగలేదు. కపిల్ శర్మ కామెడీ షోలో పాల్గొనడానికి వచ్చిన జాక్వెలెస్.. అతడిని పెళ్లి చేసుకుంటానని సరదాగా అంది. అంతేకాదు సెట్లో ఇద్దరు దండలు మార్చుకుని ఉత్తుత్తి పెళ్లి చేసుకున్నారు. ఈ ఫొటోను కపిల్ శర్మ తన ట్విట్టర్ పేజీలో పెట్టాడు.
తనను సంతోషంగా ఉంచుతానని జాక్వెలెస్ మాట ఇచ్చిందని.. షాపింగ్ కు, అవుట్డోర్ కు తీసుకెళతానని చెప్పిందని కామెంట్ పెట్టాడు. గిఫ్ట్ లు కూడా ఇస్తానని చెప్పిందన్నాడు. తాను నటించిన 'ది ఫ్లైయింగ్ జాట్' సినిమా ప్రచారం కోసం జాక్వెలెస్.. కపిల్ శర్మ షోలో పాల్గొంది. అయితే కపిల్-జాక్వెలెస్ పెళ్లి ఫొటో చూసి అభిమానులు సోషల్ మీడియాలో పలు కామెంట్లు పెట్టారు.
u make me the happiest man @Asli_Jacqueline promise me u take me shopping,outdoor,gifts n will take care of me 4ever pic.twitter.com/6bgXln562d
— KAPIL (@KapilSharmaK9) 9 August 2016