ఆమె చనిపోయింది, నిలువెల్లా వణికిపోతున్నాను: నటుడు | Mukesh Khanna Elder Sister Passed Away | Sakshi
Sakshi News home page

ఇలా జరుగుతుందని ఊహించలేదు: నటుడు ఎమోషనల్‌

Published Thu, May 13 2021 11:09 AM | Last Updated on Thu, May 13 2021 12:31 PM

Mukesh Khanna Elder Sister Passed Away - Sakshi

శక్తిమాన్‌ నటుడు ముఖేశ్‌ ఖన్నా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కోవిడ్‌ను జయించిన అతడి సోదరి కమల్‌ కపూర్‌ అనారోగ్యం కారణంగా కన్నుమూసింది. ఈ విషయాన్ని ముఖేశ్‌ ఖన్నా సోషల్‌ మీడియాలో వెల్లడిస్తూ సోదరికి అశ్రునివాళులు అర్పించాడు. 

"నేను బతికుండగానే చనిపోయానంటూ వచ్చిన వార్తలు ఫేక్‌ అని చెప్పడానికి ఎంతో ఇబ్బందిపడ్డాను. కానీ ఓ భయంకరమైన నిజం నన్ను ఇలా కుదిపేస్తుందని అస్సలు ఊహించలేదు. నా ఒక్కగానొక్క అక్క కమల్‌ కపూర్‌ ఢిల్లీలో చనిపోయింది. కరోనాతో 12 రోజులు పోరాటం చేసిన ఆమె ఆ మహమ్మారిపై పైచేయి సాధించింది. కానీ ఊపిరితిత్తుల్లో ఆటంకం కలగడంతో ఆమె ప్రాణాలు విడిచింది. ఆ దేవుడు రాసిన రాతలను మనం కలలో కూడా ఊహించలేము. నా జీవితంలో తొలిసారి బాధతో, భయంతో వణికిపోతున్నాను. కన్నీటితో నమస్కరిస్తూ.. భావోద్వేగ హృదయంతో నివాళులు అర్పిస్తున్నాను" అని ముఖేశ్‌ ఖన్నా రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌కు తన సోదరితో కలిసి దిగిన ఫొటోను జత చేశాడు.

చదవండి: లాక్‌డౌన్‌లో బాయ్‌ఫ్రెండ్‌తో శ్రుతీ రచ్చ, పోస్టు వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement