డార్లింగ్ ప్రభాస్ పేరు చెప్పగానే ప్రస్తుతం అందరికీ గుర్తొచ్చేది 'ఆదిపురుష్'. రామాయణం ఆధారంగా ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. మనం వాటిని చూసి భక్తి పారవశ్యంలో మునిగిపోయాం. కానీ 'ఆదిపురుష్'పై వచ్చినన్నీ వివాదాలు మరే మూవీ విషయంలో జరగలేదని చెప్పొచ్చు. ఇప్పుడు దీనికి సీక్వెల్ తీయబోతున్నారనే న్యూస్ బయటకొచ్చింది.
నిరాశపరిచిన 'ఆదిపురుష్'!
'బాహుబలి' తర్వాత ప్రభాస్.. పలు వైవిధ్యమైన సినిమాల్ని ఒప్పుకొన్నాడు. 'సాహో' యాక్షన్ ఎంటర్‌టైనర్ కాగా, 'రాధేశ్యామ్' ఓ లవ్ స్టోరీ, ఇప్పుడొచ్చిన 'ఆదిపురుష్' మైథలాజికల్ చిత్రం. 'బాహుబలి' తప్పితే మిగతా మూడు కూడా బాక్సాఫీస్ దగ్గర వందల కోట్ల వసూళ్లు సాధించాయి గానీ హిట్ అనిపించుకోలేకపోయాయి! ఇలా అంటే ఫ్యాన్స్ కి నచ్చకపోవచ్చు. అయినా ఇదే నిజం!
(ఇదీ చదవండి: 'సలార్' నిర్మాతలకు షాకిచ్చిన ఆ సినిమా రిజల్ట్!)
నో చెప్పిన ప్రభాస్!
'ఆదిపురుష్'లో రాముడిగా చేసిన ప్రభాస్ ని ఎవరూ పెద్దగా ఏం అనడం లేదు. కానీ డైరెక్టర్ ఓం రౌత్ ని బూతులు తిడుతున్నారు. ఇదంతా చూసి కూడా ప్రభాస్ దగ్గరకు సీక్వెల్ ప్రతిపాదనతో వెళ్లాడట. దీన్ని డార్లింగ్ హీరో సున్నితంగా తిరస్కరించాడట. ప్రస్తుతం ఈ విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రంపైనే ఇన్ని వివాదాలు వచ్చాయి. సీక్వెల్ తీస్తే ఇంకెన్ని సమస్యలు వస్తాయోనని ప్రభాస్ భయపడి ఉండొచ్చు బహుశా!
కలెక్షన్స్ ఎంత?
తొలి మూడు రోజుల్లో రూ.340 కోట్ల వసూళ్లు సాధించిన 'ఆదిపురుష్'.. నాలుగురోజు నుంచి డల్ అయిపోయింది. చెప్పాలంటే రోజురోజుకీ దారుణంగా పడిపోయాయి. అలా మొత్తంగా పది రోజుల్లో రూ.450 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు నిర్మాతలు పోస్టర్ రిలీజ్ చేశారు. కరెక్ట్ గా చెప్పాలంటే ప్రస్తుతం ఈ సినిమాని జనాలు పెద్దగా పట్టించుకోవట్లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం లెక్కలు చూస్తుంటే భారీ నష్టాలు తప్పవని తెలుస్తోంది. అవి ఎంతనేది కొన్ని రోజులైతే క్లారిటీ వచ్చేస్తుంది.
#Adipurush goes from strength to strength at the Global Box Office and collects Rs 450 CR in 10 days. Continues its steady march at the box office!#Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar @TSeries @Retrophiles1 @UV_Creations @peoplemediafcy… pic.twitter.com/ErYJ1F8Mce
— People Media Factory (@peoplemediafcy) June 26, 2023
(ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు.. వీడియో రిలీజ్ చేసిన నటి సురేఖావాణి)
Comments
Please login to add a commentAdd a comment