'జై శ్రీరామ్.. జై శ్రీరామ్.. జై శ్రీరామ్'.. దీన్ని పాటలా పాడితే చాలు మీలో చాలామందికి టక్కున గుర్తొచ్చే మూవీ 'ఆదిపురుష్'. డార్లింగ్ ప్రభాస్ రాముడిగా నటించిన ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న థియేటర్లని దేవాలయాలుగా మార్చేందుకు సిద్ధమైపోయింది. ప్రభాస్ ఫ్యాన్స్ తోపాటు జనరల్ ఆడియెన్స్ ఈ మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు.
'ఆదిపురుష్' పేరు చెప్పగానే ప్రభాస్, కృతిసనన్, డైరెక్టర్ ఓం రౌత్ అని అంటారు. అంతకు తప్పితే పెద్దగా డీటైల్స్ ఎవరికీ తెలియవు. ఇందులో సౌత్ యాక్టర్స్ ఎవరూ లేకపోవడం కూడా దీనికి కారణం అయ్యిండొచ్చు. కాబట్టి ఈ టైంలో 'ఆదిపురుష్' గురించి పెద్దగా తెలియని 10 ఆసక్తికర విషయాలే ఈ స్పెషల్ స్టోరీ.
(ఇదీ చదవండి: ఆదిపురుష్.. టికెట్ రేట్లు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!)
1.'ఆదిపురుష్' సినిమాని 1992లో వచ్చిన 'రామాయణ: ద లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ' చిత్రాన్ని స్పూర్తిగా తీసుకుని డైరెక్టర్ ఓం రౌత్ తీశారట. అది యానిమేషన్.. ఇప్పుడేమో రియల్ యాక్టర్స్ తో తీశారు.
2.'ఆదిపురుష్'కి మొదట్లో అనుకున్న బడ్జెట్ రూ.400 కోట్లు. కానీ గతేడాది టీజర్ రిలీజ్ తర్వాత గ్రాఫిక్స్ విషయమై ఘోరంగా విమర్శలు వచ్చాయి. ఫలితంగా మరో రూ.100 కోట్లు ఖర్చు చేశారు. దీంతో ఓవరాల్ బడ్జెట్ రూ.500 కోట్లకు చేరుకుంది.
3. హీరోయిన్ గా ఫస్ట్ కృతిసనన్ ని అనుకోలేదు. జానకి పాత్ర కోసం అనుష్క శెట్టి, అనుష‍్క శర్మ, కియారా అడ్వాణీ, కీర్తి సురేష్ ఇలా చాలామంది పేర్లు పరిశీలించారట.
4.'ఆదిపురుష్' కోసం దర్శకుడు ఓం రౌత్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించడం విశేషం.
5.2021లో షూటింగ్ స్టార్ట్ అయిన కొద్దిరోజులకు.. ముంబయిలో వేసిన సెట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. కాకపోతే ఎవరికీ ఏం కాలేదు. అలాంటి సెట్స్ మళ్లీ వేసి షూట్ పూర్తి చేశారు.
6. జూన్ 6న తిరుపతిలో 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించారు. దీనికోసం మూవీ టీమ్ దాదాపు రూ.2 కోట్లకు పైనే ఖర్చు చేశారట.
(ఇదీ చదవండి: 'ఆదిపురుష్' టికెట్స్ రేట్ల పెంపు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!)
7.థియేటర్లలో కంటే ముందు అంటే జూన్ 13న ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్ లో 'ఆదిపురుష్' స్క్రీనింగ్ ఉందని ప్రకటించారు. కారణాలేంటో తెలియదు గానీ ఆ స్క్రీనింగ్ ని రద్దు చేసుకున్నారు.
8.'ఆదిపురుష్' కోసం ప్రభాస్ రూ.150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. దీంతో దేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా రికార్డు సృష్టించాడు.
9.'ఆదిపురుష్'ని త్రీడీతోపాటు ఐమ‍్యాక్స్ ఫార‍్మాట్ లోనూ రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ లాస్ట్ మినిట్ లో ఐమ‍్యాక్స్ వెర్షన్ ని క్యాన్సిల్ చేశారు. హాలీవుడ్ మూవీ 'ద ఫ్లాష్' దీనికి కారణమని తెలుస్తోంది.
10. తెలుగు, హిందీలో 'ఆదిపురుష్' షూటింగ్ ఒకేసారి జరిగింది. తెలుగులో ప్రభాస్ డబ్బింగ్ చెప్పాడు, హిందీలో కుదరలేదు. దీంతో అతడికి శరద్ కేల్కర్ గొంతు అరువిచ్చాడు. అంతకు ముందు బాహుబలి హిందీ వెర్షన్ కి ఇతడే చెప్పడం విశేషం.
- ఐవీవీ సుబ్బరాజు
(ఇదీ చదవండి: ప్రభాస్ 'ఆదిపురుష్'.. వెండితెరపై మెప్పించిన టాలీవుడ్ రాముళ్లు వీరే!)
Comments
Please login to add a commentAdd a comment