పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఓంరౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత శుక్రవారం (జూన్ 16) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. బాక్సాపీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది.రెండు రోజుల్లోనే ఈ చిత్రానికి రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా చూసిన ప్రేక్షకుల్లో చాలా మంది డైలాగ్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా లంకలో ఆంజనేయస్వామి చెప్పే డైలాగ్‌ని నెట్టింట ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించిన చిత్రంలో ఇలాంటి సంభాషణలు పెట్టడం ఏంటని రామ భక్తులు పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకుల సూచనల మేరకు కొన్ని డైలాగ్స్‌ని మారుస్తామని వెల్లడించింది.
(చదవండి: ఆదిపురుష్’ పేరు పురాణాల్లో ఎక్కడినుంచి వచ్చింది?)
ప్రేక్షకుల సూచనలను గౌరవిస్తూ ‘ఆదిపురుష్’ చిత్రంలోని కొన్ని డైలాగ్స్ మార్చబోతున్నారు. సినిమాలో ఇప్పుడున్న ఫీల్ కొనసాగిస్తూనే ఆ మార్చిన సంభాషణలు ఉంటాయి. కొద్ది రోజుల్లోనే ఈ మార్పులతో థియేటర్స్ లో ‘ఆదిపురుష్’ ను చూడవచ్చు’ అని చిత్రబృందం ఓ ప్రకటనలో పేర్కొంది. డైలాగ్స్ మార్పు పెద్ద సాహసమే అయినప్పటికీ.. ప్రేక్షకుల మనోభావాలు, సెంటిమెంట్స్, వారి సూచనలు గౌరవించి ఈ నిర్ణయం తీసుకున్నామని దర్శకనిర్మాతలు పేర్కొన్నారు.
We hold immense gratitude for your valuable perspectives and thoughts! Your constant love and support is what keeps us going ❤️ Jai Shri Ram 🙏
— T-Series (@TSeries) June 18, 2023
Book your tickets on: https://t.co/2jcFFjFeI4#Adipurush now in cinemas near you! ✨ #Prabhas @omraut #SaifAliKhan @kritisanon… pic.twitter.com/EtaDsNsShz
Comments
Please login to add a commentAdd a comment