ప్రభాస్ కీలక పాత్రలో ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదిపురుష్ ’ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. సినిమాపై డివైడ్ టాక్ వస్తున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. కానీ నెటిజన్స్ మాత్రం దర్శకుడు ఓం రౌత్‌ని ట్రోల్స్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా ఇదీ.. ఓం రౌత్ రామాయణం అని కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో రామాయణంలో వున్న కథని వక్రీకరించి ఓం రౌత్ తనకి నచ్చిన కథని పెట్టుకున్నాడు అని విమర్శలు వస్తున్నాయి.
(ఇదీ చదవండి: Adipurush: ఫస్ట్ డే కలెక్షన్స్ తుఫాన్.. పక్కాగా ఆ సినిమాలను దాటేస్తుంది)
దీంతో 'ఓం! కమ్ టు మై రూమ్' అనే వర్డ్ తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతుంది. తాజాగా సినిమాపై ఆయన ఓ ట్వీట్ చేశారు. థియేటర్లలో హనుమంతుడి కోసం కేటాయించిన సీట్ల ఫోటోలను ఒకచోటకు చేర్చి ట్విటర్‌లో షేర్ చేశాడు. 'జై శ్రీరామ్' అంటూ దేశంలోని అన్ని థియేటర్లు భక్తితో నిండిపోయాయని తెలిపాడు. ఆదిపురుష్ కథపై వస్తున్న విమర్శలకు ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.
Jai Shri Ram 🙏🏼 pic.twitter.com/oyXY57U7Lz
— Om Raut (@omraut) June 17, 2023
(ఇదీ చదవండి: ఓం రౌత్‌ను ప్రభాస్ డైలాగ్‌తోనే ఆడుకుంటున్న నెటిజన్లు)
Comments
Please login to add a commentAdd a comment