BJP Spokesperson Malavika Avinash Fires On Director Om Raut Over Adipurush Teaser - Sakshi
Sakshi News home page

Adipurush Teaser: ‘ఓం రౌత్‌కు రామాయణం తెలియదా?’ బీజేపీ మహిళా నేత విమర్శలు

Published Tue, Oct 4 2022 11:02 AM | Last Updated on Tue, Oct 4 2022 1:04 PM

BJP Spokesperson Malavika Avinash Fires On Adipurush Director Om Raut - Sakshi

ఇటీవల విడుదలైన ప్రభాస్‌ ఆదిపురుష్‌ టీజర్‌కు మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది టీజర్‌ అద్బుతంగా ఉందంటూ ప్రశసి​స్తుండగా మరికొందరు కార్టూన్‌ సినిమా మాదిరి ఉందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయోధ్య వేదికగా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన టీజర్‌ నిరాశ పరిచిందంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ డైరెక్టర్‌ ఓం రౌత్‌పై బీజేపీ అధికార ప్రతినిధి, నటి మాళవిక అవినాష్ మండిపడ్డారు. ఓం రౌత్‌ రామాయణం గురించి అధ్యయనం చేయకుండానే సినిమా తీశారంటూ సోషల్‌ మీడియా వేదికగా ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.


చదవండి: రిపోర్టర్‌పై నటి హేమ ఫైర్‌.. ‘భక్తి కోసం వచ్చా కాంట్రవర్సికి కాదు’

ఆమె ట్వీట్‌ చేస్తూ.. ‘లంకకు చెందిన రావణుడు శివ భక్త బ్రాహ్మణుడు. 64 కళల్లో ప్రావీణ్యం సంపాదించాడు. వైకుంఠాన్ని కాపాడుతున్న జయ శాపం కారణంగా రావణునిగా అవతరించాడు. కానీ మన చరిత్రను, రామాయణంను బాలీవుడ్‌ దర్శకులు తప్పుగా చూపిస్తున్నారు. ఇక దీన్ని ఆపండి’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు. అలాగే ‘‘బహుశా డైరెక్టర్​ ఓం రౌత్​. వాల్మీకి రామాయణం, తులసీదాసు రామాయణంలో రావణుడి పాత్ర ఎలా ఉంటుందో అధ్యయనం చేయలేదనుకుంటా. కనీసం తెలుగు, తమిళంలో ఇదివరకు తెరకెక్కిన పౌరాణిక సినిమాల్లో రావణుడి పాత్ర ఎలా ఉందో పరిశీలించాల్సింది.

‘భూకైలాస’లో సీనియర్ ఎన్టీఆర్​ లేదా సంపూర్ణ రామాయణంలో ఎస్వీ రంగారావు చేసిన రావణుడి పాత్రను చూసి అర్థం చేసుకోవచ్చు. టీజర్​లో రావణుడు నీలి కళ్లతో లెదర్​ జాకెట్​ వేసికున్నట్లు చూపించారు. స్వేచ్ఛా ముసుగులో చరిత్రను వక్రీకరించకూడదు. రామాయణం మన దేశ ప్రజల నాగరికతను కాపాడుతుంది. అలాంటి రామాయణాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కిస్తున్న సినిమాలో రావణుడి పాత్రను వక్రీకరించినందుకు చాలా బాధగా ఉంది’’ అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు. కాగా ఈ టీజర్‌ రిలీజైన అనంతరం ఇది యానిమేటెడ్‌ చిత్రంలా ఉందని, వీఎఫ్‌ఎక్స్‌ అసలు బాగాలేదంటూ కామెంట్స్‌ చేస్తున్నారు కొందరు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement