‘‘న్యూయార్క్‌లోని ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘ఆదిపురుష్’ చిత్రం వరల్డ్ ప్రీమియర్‌ను ప్రదర్శించనుండటం గర్వంగా ఉంది. మన దేశ నైతికతకు అద్దం పట్టే ఈ సినిమాలో భాగం కావడం నా అదృష్టం’’ అన్నారు ప్రభాస్. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కాగా జూన్ 7 నుంచి 18 వరకు జరిగే ట్రిబెకా ఫెస్టివల్‌లో భాగంగా జూన్ 13న ‘ఆదిపురుష్’ చిత్రం వరల్డ్ ప్రీమియర్‌ని (త్రీడీ) ప్రదర్శించనున్నారు.
(చదవండి: అదిరిపోయేలా ‘గేమ్ చేంజర్’ క్లైమాక్స్.. 1000 మంది ఫైటర్స్‌తో యాక్షన్ సీక్వెన్స్)
ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘మన భారతీయ చిత్రాలను ఇతర దేశాల్లో చూడటం, ముఖ్యంగా ‘ఆదిపురుష్’ ప్రపంచ స్థాయికి చేరుకోవడం ఒక నటుడిగానే కాకుండా భారతీయుడిగా గర్వంగా ఉంది’’ అన్నారు. ‘‘ఆదిపురుష్’ సినిమా కాదు.. భారతదేశ స్ఫూర్తితో ప్రతిధ్వనించే కథ. మన సంస్కృతిలో బాగా పాతుకుపోయిన కథను ప్రపంచ వేదికపై ప్రదర్శించబోతుండటం హ్యాపీ’’ అన్నారు ఓం రౌత్. ‘‘భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం మనందరికీ నిజంగా గర్వకారణం’’ అన్నారు నిర్మాత భూషణ్ కుమార్. కృతీ సనన్ , సైఫ్ అలీఖాన్ , సన్నీ సింగ్ నటించిన ఈ చిత్రానికి నిర్మాతలు: భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, ఓం రౌత్, ప్రసాద సుతారియా, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్, యూవీ క్రియేషన్స్ ప్రమోద్, వంశీ.
Comments
Please login to add a commentAdd a comment