ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’కు అరుదైన గౌరవం... ఆ వేడుకలో స్క్రీనింగ్.. | Prabhas Adipurush To Have World Premiere At Tribeca Film Festival 2023 - Sakshi
Sakshi News home page

Adipurush: ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’కు అరుదైన గౌరవం.. మురిసిపోతున్న డైరెక్టర్‌

Published Wed, Apr 19 2023 8:00 AM | Last Updated on Wed, Apr 19 2023 9:36 AM

Prabhas Adipurush To Have World Premiere At Tribeca Film Festival - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న మైథలాజికల్‌ డ్రామా ‘ఆదిపురుష్‌’ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. సినీ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ‘ట్రిబెకా ఫెస్టివల్‌’లో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు ఓంరౌత్‌ సోషల్‌ మీడియా వేదికగా తెలియజేస్తూ  ఈ ఫెస్టివల్‌లో ఆదిపురుష్‌ని ప్రదర్శించడం ఖచ్చితంగా గొప్ప విషయం అని,  ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.

‘సంతోషానికి మించిన విషయం ఇది. 2023 జూన్‌ 13న ‘ఆదిపురుష్‌’ న్యూయార్క్‌లో జరిగే ట్రిబెకా ఫెస్టివల్‌లో ప్రదర్శితమవుతుంది. ఈ సినిమాని ఎంపిక చేసిన ట్రిబెకా జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు. ఆదిపురుష్‌ టీమ్‌ సభ్యులందరికి కృతజ్ఞతలు. ఆ వేడుక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’అని ఓం రౌత్‌ ట్వీట్‌ చేశాడు. జూన్‌ 7 నుంచి 18 వరకు ట్రిబెకా ఫెస్టివల్‌ వేడుకలు జరగనున్నాయి. 

రామాయణం ఇతీహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా, కృతిసనన్‌ సీతగా నటించారు. రావణాసురుడి పాత్రను సైఫ్‌ అలీఖాన్‌ పోషించాడు.  ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం గ్రాఫిక్స్‌ పనుల కారణంగా వాయిదా పడింది. జూన్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement