Difference Between Prabhas Adipurush Movie Old Teaser And New Trailer, Deets Inside - Sakshi
Sakshi News home page

Adipurush Teaser Vs Trailer: టీజర్‌కి, ట్రైలర్‌కి తేడా ఏంటి? 7 నెలల గ్యాప్‌లో ఏం జరిగింది?

Published Tue, May 9 2023 5:00 PM | Last Updated on Tue, May 9 2023 5:34 PM

Difference Between Adipurush Trailer And Teaser - Sakshi

ఆదిపురుష్...ఈ సినిమా టీజర్‌ ఏకంగా ఏడు నెలల క్రితం రిలీజ్ అయ్యింది. ఈ పాటికి ఆదిపురుష్ రిలీజ్ అయ్యి, థియేటర్ రన్ పూర్తి చేసుకుని ఓటీటీకి కూడా వచ్చి ఉండాలి. కానీ ఆ ట్రైలర్ క్వాలిటీ, దాని పై నడిచిన రచ్చతో సినిమా టీమ్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ప్రభాస్ చెప్పినా కూడా ఫ్యాన్స్ నుంచి నెగెటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమా విడుదలను వాయిదా వేశారు. తాజాగా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. కానీ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. మరి అప్పటి టీజర్ కి,ఇప్పటి ట్రైలర్ కి తేడా ఏంటి?...ఈ ఏడునెలల గ్యాప్ లో ఏం మ్యాజిక్ జరిగింది?

(చదవండి: ఆదిపురుష్‌' ట్రైలర్‌.. గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న డైలాగ్స్‌)

నిజానికి ఈ సినిమా మోషన్ కాప్చర్ టెక్నాలజీలో తెరకెక్కింది అనేది అప్పుడు బాగా వినిపించిన టాక్. కనిపించిన విజువల్స్ కూడా అదే మాట చెప్పాయి. అయితే సినిమా వాయిదా పడిన తరువాత ఓం రౌత్ మళ్ళీ చాలా రీ వర్క్ చేశాడు. చాలా చోట్ల ప్రభాస్ క్లోజ్ లు షూట్ చేసి ఇన్సర్ట్ చేశారు. ఎక్కడయితే కార్టూన్ అని కామెంట్స్ వచ్చాయో ఆ చోట్ల వీఎఫ్‌ఎక్స్‌ రీ వర్క్ చేయించారు. ఆర్‌ఆర్‌ కూడా చాలా కేర్ తీసుకున్నారు. అయితే పనిలో పనిగా  వీఎఫ్‌ఎక్స్‌ రిపెయిర్ టైం లోనే ఆర్‌ఆర్‌ కూడా మళ్ళీ చేయించారని టాక్. దీనంతటి కోసం మరో 100 కోట్లు ఖర్చు చేశారు అని తెలుస్తుంది. 

(చదవండి: మహిళా అభిమాని దురుసుతనం.. స్టార్‌ సింగర్‌కు గాయం! )

అలాగే ట్రైలర్ లో  టీజర్ లో కనిపించినట్టుగా లెంగ్తీ షాట్స్ లేకుండా కట్ చేశారు. ఏదయితేనేం మొత్తానికి ఆది పురుష్ సినిమాకి టీజర్ తెచ్చిన డార్క్ స్పాట్ ని ట్రైలర్ తో క్లియర్ చేశారు. సరయిన స్టార్ వేల్యూ ఉన్నసినిమా రాక వెలవెల బోతున్న బాక్స్ ఆఫీస్ కి ఆదిపురుష్ గ్రాండ్ ఓపెనింగ్స్ తెచ్చుకోబోతుంది. ఈ ట్రైలర్ చూశాక సినిమాని ప్రీ పోన్ చెయ్యమని డిమాండ్స్ వినిపించడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement