‘ఆదిపురుష్‌’నుంచి స్పెషల్‌ వీడియో.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌ | Om Raut Share Special Video From Adipurush, Prabhas Fans Trolled | Sakshi
Sakshi News home page

Adipurush: ‘ఆదిపురుష్‌’నుంచి స్పెషల్‌ వీడియో.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

Published Sun, Apr 10 2022 1:02 PM | Last Updated on Sun, Apr 10 2022 1:02 PM

Om Raut Share Special Video From Adipurush, Prabhas Fans Trolled - Sakshi

ప్రభాస్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రాల్లో ‘ఆదిపురుష్‌’ ఒకటి. ఓంరౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతీ సనన్, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్ నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులతో పాటు పలు టెక్నికల్‌ వర్క్స్‌తో మూవీ టీం ఫుల్‌ బిజీగా ఉంది.  

ఇదిలా ఉంటే శ్రీరామనవమి సంద​ర్భంగా స్పెషల్‌ వీడియోతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేశాడు దర్శకుడు ఓంరౌత్‌. అందులో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అతన్ని రాముడిగా ఊహిస్తూ రెడీ చేసిన ఫ్యాన్‌ మేడ్‌ పోస్టర్స్‌ ఉన్నాయి. వాటన్నింటిని కలిసి ఓ వీడియో రూపంలో ఓరౌంత్‌ ట్వీట్‌ చేశాడు. ఇందులో ఆదిపురుష్‌ విడుదల తేదిని కూడా ప్రకటించాడు. అయితే ఈ వీడియో పట్ల ప్రభాస్‌ ఫ్యాన్స్‌ చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

శ్రీరామనవమి కానుకగా ఫస్ట్‌లుక్‌ వస్తుందనుకుంటే.. ఈ వీడియో షేర్‌ చేస్తారా అని ఫైర్‌ అవుతున్నారు. పండగ సందర్భంగా ఫస్ట్‌లుక్‌ విడుదల చేస్తే.. ఎక్కువ రీచ్‌ అయ్యేది కదా అని ఓ నెటిజన్‌ కామెంట్‌ పెట్టారు. ఇప్పటికే ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేయండి అని రిక్వెస్ట్‌ పెడుతున్నారు. ఇటీవల రాధేశ్యామ్‌తో ప్రేక్షలను పలకరించిన ప్రభాస్‌.. ప్రస్తుతం సలార్‌, స్పిరిట్‌ సినిమాల షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement