ఆదిపురుష్ సినిమాకు భారీ ఎత్తున కలెక్షన్లు వస్తున్నాయి. అంతే భారీగా విమర్శలు సైతం వస్తున్నాయి. దశరథుడిగా ప్రభాస్ లుక్ బాలేదని, కొన్ని డైలాగ్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని, మరికొన్ని చోట్ల వీఎఫ్‌ఎక్స్ చాలా పేలవంగా ఉన్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆదిపురుష్ టీం కొన్ని తప్పులను సరిదిద్దుకునేందుకు రెడీ అయింది. ముఖ్యంగా హనుమంతుడితో చెప్పించే మాస్ డైలాగ్స్‌ను తీసేసి ఆ స్థానంలో కొత్తవి చేర్చనున్నట్లు ప్రకటించారు.
రామాయణం తెలుసంటే అబద్ధమే
అయినప్పటికీ ఈ ట్రోలింగ్ ఆగడం లేదు. మరీ ముఖ్యంగా ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్‌కు అసలు రామాయణం తెలుసా? అని ఆడేసుకుంటున్నారు. నటీనటులను ఓం రౌత్ సరిగా వాడుకోలేకపోయాడని నెట్టింట రివ్యూ ఇస్తున్నారు. తాజాగా ఈ నెగెటివ్ రివ్యూలపై ఓం రౌత్ స్పందించాడు. 'బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి స్పందన వస్తుందన్నది ముఖ్యం. ఈ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఈ చిత్రానికి మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇకపోతే నాకు రామాయణం అంతా తెలుసని చెప్తే అది అబద్ధమవుతుంది. ఎందుకంటే రామాయణాన్ని పూర్తిగా అర్థం చేసుకునే సామర్థ్యం ఎవరికీ లేదని నేను భావిస్తున్నాను.
అంత ఈజీ కాదు
నాకూ, మీకూ తెలిసిన రామాయణం ఉడుత చేసే సాయమంత ఉంటుంది. నాకు అర్థమైన కొంత భాగాన్ని వెండితెరపై చూపించే ప్రయత్నం చేశాను. పూర్తి రామాయణాన్ని స్క్రీన్‌పై చూపించడం అంత సులువు కాదు, అందుకే యుద్ధకాండలోని కొంత భాగంపై నేను దృష్టి సారించా. అయినా రామాయణాన్ని సంపూర్ణంగా గ్రహించడం అంత సులువేమీ కాదు. నాకు రామాయణం మొత్తం తెలుసు అని ఎవరైనా అంటున్నారంటే వాళ్లు తెలివి తక్కువ వాళ్లైనా అయి ఉండాలి లేదంటే అబద్ధమైనా చెప్తుండాలి' అని చెప్పుకొచ్చాడు ఓం రౌత్. ఇకపోతే ఆదిపురుష్ మొదటి రోజు రూ.140 కోట్లు రాబట్టగా రెండో రోజు రూ.100 కోట్లు వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే!
చదవండి: హఠాత్తుగా ఎందుకంత కోపం? నన్ను, నా తల్లిని తిడుతున్నారు: ఆదిపురుష్ రచయిత
Comments
Please login to add a commentAdd a comment