
హిందీలో 5 నిమిషాల్లో, తెలుగులో 9 నిమిషాల్లో లక్ష లైక్స్ సాధించింది అని తెలుపుతూ ఓ వీడియో షేర్ చేశాడు ఓం రౌత్. కాగా ఆర్‌ఆర్‌ఆర్ ట్రైలర్ రిలీజైన 24 గంటల్లో అన్ని
రామాయణ కథ అందరికీ తెలుసు.. దీనిపై ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి, విజయం సాధించాయి. తాజాగా మరోసారి రామాయణ కథను కళ్లకు కట్టినట్లు చూపించడానికి వస్తోంది ఆదిపురుష్. రాముడిగా ప్రభాస్, సీతగా కృతీ సనన్ నటించిన ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ మంగళవారం(మే 9న) రిలీజైంది. తాజాగా ఈ ట్రైలర్ రికార్డులు బద్ధలు కొడుతూ కోట్ల కొద్ది వ్యూస్‌తో దూసుకుపోతోంది.
'తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కలుపుకుని ట్రైలర్ రిలీజైన 24 గంటల్లోనే 70 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది. అన్ని భాషల్లోనూ కేవలం పది నిమిషాల్లో లక్ష వ్యూస్ వచ్చిపడ్డాయి. హిందీలో 5 నిమిషాల్లో, తెలుగులో 9 నిమిషాల్లో లక్ష లైక్స్ సాధించింది' అని తెలుపుతూ ఓ వీడియో షేర్ చేశాడు ఓం రౌత్. కాగా ఆర్‌ఆర్‌ఆర్ ట్రైలర్ రిలీజైన 24 గంటల్లో అన్ని భాషల్లో కలుపుకుని 55 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది. తాజాగా ఆదిపురుష్ ఆ రికార్డును భూస్థాపితం చేసింది.
గుల్షన్ కుమార్, టీ సిరీస్ సమర్పణలో భూషణ్ కుమార్, క్రిష్ణకుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతారియా, రాజేశ్ నాయర్, వంశీ, ప్రమోద్ నిర్మించారు. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ చిత్రం జూన్ 16న రిలీజ్ కానుంది.
#AdipurushTrailer breaking records all over! 🏹🔥
— Om Raut (@omraut) May 10, 2023
Trailer out now: https://t.co/hax5G3AXlO
Jai Shri Ram 🙏 #Adipurush #Prabhas #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar @vfxwaala @rajeshnair06 @DevdattaGNage @AjayAtulOnline @manojmuntashir pic.twitter.com/Pn8Ctq2qWH
చదవండి: మీ పెంపకం ఎలాంటిదోనన్న అనసూయ.. ఈ లొల్లేందన్న రాహుల్