
ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ మూవీకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. టెక్నికల్‌గా సినిమా బాగుందని.. కానీ కథ, కథనమే బాగోలేదని కొంతమంది విమర్శిస్తున్నారు. ఇక మరికొంతమంది అయితే దర్శకుడు ఓం రౌత్ రామాయణాన్ని వక్రీకరించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారని మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్నికి ‘ఆదిపురుష్’అనే పేరు ఎందుకు పెట్టారనేది చాలా మంది మెదళ్లలో మెదులుతున్న ప్రశ్న.
మన తెలుగు వాళ్లకు తెలిసినంతవరకు రాముడిని దండరాముడు, అయోధ్య రాముడు, కౌసల్యా తనయుడు, సీతాపతి, ఇనకుల చంద్రుడు, రామచంద్రుడు..ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఆరాధిస్తాం. కానీ వాల్మీకి రామాయణంతో పాటు ఇతర రామాయణాల్లో ఎక్కడ రాముడికి ఆదిపురుష్ అనే పేరే లేదని పండితులు చెబుతున్న మాట.
ఆధ్యాత్మిక ప్రస్తావనల్లో ఎక్కడయినా ఆదియోగి అంటే శివుడు. ఎప్పుడు పుట్టాడో తెలియని అనే అర్థంలో విష్ణువును ఆదిపురుషుడు అంటున్నాం. ఎప్పుడు పుట్టాడో తెలిసిన రాముడికి కూడా అదే అన్వయమవుతుందని సినిమావారు భావించి ఈ పేరు పెట్టారేమో. లేదంటే ఆదిపురుషుడైన విష్ణువు రాముడిగా పుట్టాడనే కోణంలో ఈ చిత్రానికి ‘ఆదిపురుష్’ అని టైటిల్ పెట్టి ఉండవచ్చు. అయితే తమ చిత్రానికి ‘ఆదిపురుష్’ అన్న పేరు ఎంచుకోవడం వెనుక కారణం ఏంటో చిత్రబృందం క్లారిటీ ఇస్తే బాగుండేది.
Comments
Please login to add a commentAdd a comment