Prabhas Warns Om Raut Before Adipurush Shooting - Sakshi
Sakshi News home page

Prabhas Adipursh: ప్రభాస్ ముందే చెప్పాడు.. కానీ ఓం రౌత్ వినలేదా?

Published Wed, Jun 21 2023 8:57 AM | Last Updated on Wed, Jun 21 2023 9:15 AM

Prabhas Warning Om Raut Adipurush Shooting - Sakshi

ఒక సినిమా చేస్తున్నప్పుడే హీరోలకు అది హిట్ అవుతుందా లేదా అనేది దాదాపుగా తెలిసిపోతుంది. ఒకవేళ ఏమైనా తేడా కొడితే రిజల్ట్ గురించి హీరోలు పెద్దగా మాట్లాడటానికి ఇష్టపడరు. వీలైనంత వరకు సైలెంట్ గానే ఉంటారు. 'ఆదిపురుష్' విషయంలో మాత్రం రిజల్ట్ గురించి హీరో ప్రభాస్ ముందే పసిగట్టేశాడా అనే సందేహం వస్తుంది. ఎందుకంటే ఓ పాత వీడియోలో ప్రభాస్ చేసిన వ్యాఖ్యలే ఈ కొత్త డౌట్స్ వచ్చేలా చేస్తున్నాయి.

డార్లింగ్ ప్రభాస్ రాముడిగా నటించిన సినిమా 'ఆదిపురుష్'. థియేటర్లలోకి రాకముందు కొన్ని విమర్శలు ఎదుర్కొన్న ఈ చిత్రం.. ప్రేక్షకుల ముందుకొచ్చిన తర్వాత మరింతగా వివాదాలకు కారణమవుతోంది. కొందరికి ఈ మూవీ నచ్చింది, మరికొందరికి నచ్చలేదు. అయితే ఈ సినిమా షూటింగ్ టైంలోనే ప్రభాస్ కి ఎందుకో సందేహం వచ్చింది. కానీ డైరెక్టర్ ఓం రౌత్.. ఇతడి మాట వినలేదనిపిస్తుంది. 'రాధేశ్యామ్' ప్రమోషన్స్ టైంలో ప్రభాస్ చేసిన కామెంట్స్ ఇదే నిజమనిపించేలా ఉన్నాయి.

(ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన 'ఆదిపురుష్' టీమ్!)

'ఆదిపురుష్ షూటింగ్ నాలుగు రోజులు జరిగిన తర్వాత నాకెందుకో ఔట్‌ఫుట్ మీద డౌట్ వచ్చింది. నేను ఈ సినిమా చెయ్యొచ్చా? ఇంతకుముందు నేను ఇలాంటి పాత్రలో నటించలేదు. మిగతా చిత్రాల విషయంలో తప్పు జరిగినా పర్లేదు కానీ రామాయణం విషయంలో తప్పు జరగకూడదు. ఆదిపురుష్ విషయంలో మనం తప్పు చేయకూడదు అని ఓం రౌత్ ని అడిగాను. అతను.. 'మీరు అలాంటి భయలేం పెట్టుకోవద్దు. సినిమా బాగా వస్తుంది, నేనున్నాను' అన్నాడు' అని ప్రభాస్ ఈ పాత వీడియోలో చెప్పుకొచ్చాడు.

ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్స్.. ప్రభాస్ ముందే 'ఆదిపురుష్' రిజల్ట్ ఊహించినట్లున్నాడు. అది చెబితేనే ఓం రౌత్ వినలేదు అని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా 'రామాయణం' ఆధారంగా ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చినా 'ఆదిపురుష్' విషయంలో జరిగినంత రచ్చ అయితే ఎ‍ప్పుడు జరగలేదు. ఇక కలెక్షన్స్ విషయానికొస్తే.. తొలి మూడు రోజుల్లో రూ.340 కోట్లు వసూలు చేసింది. సోమవారానికి దారుణంగా పడిపోయింది. కేవలం రూ.35 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ వారం నిలబడితేనే సినిమా గట్టెక్కుతుంది. లేదంటే నష్టాలు తప్పవేమో అనిపిస్తోంది.

(ఇదీ చదవండి: పాన్ ఇండియా హీరోలకు బోలెడు కష్టాలు.. ప్రభాస్ సహా వాళ్లందరూ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement