
ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్‌తో 6 టీన్స్, గర్ల్ ఫ్రెండ్, జానకి వెడ్స్ శ్రీరామ్ వంటి హిట్లు కొట్టిన నటుడు రోహిత్. అనంతరం క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా మారి శంకర్‌దాదా MBBS, నవ వసంతం వంటి సినిమాల్లో నటించాడు. ఆయన చాలా గ్యాప్ తర్వాత హీరోగా చేస్తున్న చిత్రం ‘కళాకార్’. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీకి శ్రీను బందెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆదివారం (సెప్టెంబర్ 19న) విడుదల చేశాడు.
ఏజీ అండ్ ఏజీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. రోహిత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని ఇటీవల నటుడు శ్రీకాంత్ విడుదల చేశాడు. ప్రభాస్ టీజర్ చూసి మెచ్చుకున్నారని, దసరాకి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు మూవీ టీం తెలిపింది. కాగా, యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ టీజర్ ఆకట్టుకునేలా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment