సస్పెన్స్ థ్రిల్లర్‌ | Allari Naresh Launched Gripping Teaser Of Raa Raja | Sakshi
Sakshi News home page

సస్పెన్స్ థ్రిల్లర్‌

Published Mon, Jun 17 2024 3:39 AM | Last Updated on Mon, Jun 17 2024 3:48 AM

Allari Naresh Launched Gripping Teaser Of Raa Raja

సుగి విజయ్, మౌనిక మగులూరి జంటగా నటించిన హారర్‌ అండ్‌ సస్పెన్స్ థ్రిల్లర్‌ మూవీ ‘రా.. రాజా’. బి. శివప్రసాద్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ మూవీ టీజర్‌ను హీరో ‘అల్లరి’ నరేశ్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘రా..రాజా’ టీజర్‌ చాలా ఆసక్తిగా ఉంది.

ఈ సినిమాలో నటించిన 24మంది పాత్రల ముఖాలు కనిపించవు. కృత్రిమ మేథస్సును వినియోగిస్తున్న ఈ జనరేషన్ లో కూడా ఇలాంటి చిత్రం చేయడం ఓ కొత్త ప్రయోగమే. ఈ సినిమా కొత్త ట్రెండ్‌ సెట్‌ చేస్తుందనిపిస్తోంది’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: శేఖర్‌ చంద్ర, కెమెరా: రాహుల్‌ శ్రీవాత్సవ్‌.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement