ఆయూషీ పటేల్, రాజేంద్ర ప్రసాద్, విశ్వ కార్తికేయ
రాజేంద్ర ప్రసాద్
విశ్వ కార్తికేయ, ఆయూషీ పటేల్ జంటగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో..’. రమాకాంత్ రెడ్డి దర్శకత్వంలో డా. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి. మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘కలియుగం పట్టణంలో..’ టైటిల్ కొత్తగా ఉంది. కొత్త పాయింట్‌తో ఈ చిత్రం రాబోతోందని అర్థం అవుతోంది. నా ‘ఆ నలుగురు’ సినిమాలో అప్పడాలు అమ్మి పెట్టడంలో నా గురువుగా ఆరేళ్ల వయసులోనే విశ్వ కార్తికేయ నాతో పాటు నటించాడు.
ఇప్పుడు హీరోగా నటించాడు. ప్రేక్షకులు ఈ సినిమాను పెద్ద సక్సెస్ చేయాలి. ప్రస్తుతం ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ఓ రోల్ చేస్తున్నాను’’ అన్నారు. ‘‘మదర్ సెంటిమెంట్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసి ఈ సినిమా తీశారు. చిత్రా శుక్లా ఓ స్పెషల్ రోల్ చేశారు’’ అన్నారు విశ్వ కార్తీకేయ. ‘‘మా చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు రమాకాంత్ రెడ్డి. ‘‘మా టీజర్, ట్రైలర్‌ను చూసి కథను అంచనా వేయలేరు. సినిమా అంత కొత్తగా ఉంటుంది. ఈ సినిమా చిత్రీకరణను కడపలోనే చేశాం’’ అన్నారు కందుల చంద్ర ఓబుల్ రెడ్డి. ‘‘సినిమా అంతా కడపలోనే తీయడం ఇదే తొలిసారి. కడప నుంచి ఓ మంచి నిర్మాత రాబోతున్నాడు’’ అన్నారు దర్శకుడు నీలకంఠ.
Comments
Please login to add a commentAdd a comment