విభిన్న రాఘవన్‌ | Vijaya Raghavan Teaser Launch | Sakshi
Sakshi News home page

విభిన్న రాఘవన్‌

Published Sun, Jan 3 2021 6:15 AM | Last Updated on Sun, Jan 3 2021 6:15 AM

Vijaya Raghavan Teaser Launch - Sakshi

విభిన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు తమిళ నటుడు విజయ్‌ ఆంటోనీ. ఆయన నటించిన తాజా చిత్రం ‘విజయ రాఘవన్‌’. ఆత్మిక కథానాయిక. ఆనంద కృష్ణన్‌ దర్శకత్వంలో ఈ సినిమాను టి.డి. రాజా, డి.ఆర్‌. సంజయ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. న్యూ ఇయర్‌ స్పెషల్‌గా ఈ చిత్రం టీజర్‌ను శనివారం విడుదల చేశారు. యాక్షన్‌ నిండిన ఈ టీజర్‌ ఆకట్టుకునేలా ఉంది. ‘‘గతంలో విజయ్‌ ఆంటోనీ చేసిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమాకు కెమెరా: ఎన్‌.ఎస్‌. ఉదయ్‌ కుమార్, సహ నిర్మాతలు: కమల్‌ బోరా, లలితా ధనుంజయన్, బి. ప్రదీప్, పంకజ్‌ బోరా, ఎస్‌. విక్రమ్‌ కుమార్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement