Vijaya Raghavan
-
గోమాత అంటూనే పాలు, పెరుగుపై జీఎస్టీ వేస్తారా?
సాక్షి, హైదరాబాద్: గోమాత అంటూనే పాలు, పెరుగుపై మోదీ ప్రభుత్వం జీఎస్టీ వేసిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ఎ.విజయరాఘవన్ విమర్శించారు. బియ్యం, గోధుమలతోపాటు ఇతర ఆహార పదార్థాలపై కూడా జీఎస్టీ విధించి ప్రజల నడ్డి విరుస్తోందని ఆరోపించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు కార్యక్రమాలను శనివారం సీపీఎం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా లోయర్‌ట్యాంక్‌బండ్‌లోని వీరనారి ఐలమ్మ విగ్రహానికి విజయ రాఘవన్‌తోపాటు పార్టీ నేతలు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ట్యాంక్‌బండ్‌పై ఉన్న మఖ్దూం మొహియుద్దీన్ విగ్రహం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అక్కడ విజయరాఘవన్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో సమరశీల ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17పై బీజేపీ ప్రభుత్వం అబద్ధాలను ప్రచారం చేస్తోందని విమర్శించారు. నిజాంకు వ్యతిరేకంగా హిందూ– ముస్లింల మధ్య పోరాటం సాగిందంటూ చరిత్రను వక్రీకరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రధానమంత్రి మాంత్రికుడిగా మారారని, బడా పారిశ్రామికవేత్తలైన అదానీ, అంబానీల కోసమే బీజేపీ నేతలు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యం, లౌకికత్వం, రాష్ట్రాల హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని ఆయన సూచించారు. కేరళలోని 96 శాతం కుటుంబాల చేతిలో మొత్తం భూమి ఉందని, అక్కడ పాలిస్తున్న వామపక్షాలే దేశానికే ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. -
‘విజయ రాఘవన్’ మూవీ రివ్యూ
టైటిల్ : విజయ రాఘవన్ నటీనటులు : విజయ్ ఆంటోని, ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్ తదితరులు నిర్మాతలు : టి.డి.రాజా, డి.ఆర్. సంజయ్ కుమార్ దర్శకత్వం: ఆనంద కృష్ణన్ సంగీతం : నివాస్ కె.ప్రసన్న సినిమాటోగ్రఫీ : ఎన్.ఎస్.ఉదయ్‌కుమార్ ఎడిటింగ్: విజయ్ ఆంటోని విడుదల తేది : సెప్టెంబర్ 17, 2021 ‘నకిలీ, డా.సలీమ్, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్’ వంటి చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోని. ఈయన హీరోగా.. ‘మెట్రో’ వంటి డిఫరెంట్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ ఆనంద కృష్ణన్ తెరకెక్కించిన చిత్రం ‘విజయ రాఘవన్’. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్ సమర్పణలో చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై టి.డి.రాజా, డి.ఆర్.సంజయ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘కోడియిల్ ఒరువన్’ పేరుతో తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీకరి ఫిలింస్ బ్యానర్‌పై రవిచంద్రా రెడ్డి, శివారెడ్డి తెలుగులో విడుదల చేశారు. ‘విజయ రాఘవన్’ పేరుతో తెలుగులో సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే? అరకులోని ఓ గ్రామానికి చెందిన విజయ రాఘవన్ (విజయ్ ఆంటోని) తన తల్లి ఆశయం కోసం ఐఏఎస్ కావాలనుకుంటాడు. ఇందుకోసం ఆయన హైదరాబాద్ వచ్చి ఒక పక్క పిల్లలకు ట్యూషన్ చెబుతూ.. మరో పక్క ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతూ ఉంటాడు. అయితే అనుకోకుండా విజయ్ రాఘవన్ లోకల్ రాజకీయాల్లోకి తలదూర్చాల్సివస్తుంది. దాని వల్ల ఐఏఎస్ ఐఏఎస్ ఇంటర్వ్యూ అడ్డంకులు వస్తాయి. ఒకవైపు తల్లికిచ్చిన మాట మరోవైపు రాజకీయనాయకులు ఒత్తిడి. చివరికి ఆ కాలనీకి కార్పొరేట్ గా ఎన్నికవుతాడు. విజయ రాఘవన్ రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? ఆయన కార్పొరేటర్ గా ఎలా గెలిచాడు ? తల్లికి ఇచ్చిన మాటను నెరవేర్చాడా లేదా? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే.. విజయ రాఘవన్ పాత్రలో కనిపించిన విజయ్ ఆంటోని తన హావభావాలతో చక్కగా నటించాడు. తల్లికి ఇచ్చిన మాట కోసం పాడుపడే ఓ మంచి కొడుకుగా తనదైన నటనతో సినిమా భారం మొత్తాన్ని భూజాన వేసుకొని నడిపించాడు. పోరాట సన్నివేశాల్లో విజయ్ చక్కగా నటించాడు. అలాగే ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించిన ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్ మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. ఎలా ఉందంటే? ‘మెట్రో’ వంటి డిఫరెంట్ మూవీని తెరకెక్కించి విమర్శకుల ప్రసంసలు అందుకున్న ఆనంద కృష్ణన్ దర్శకత్వం వహించిన రెండో చిత్రమే విజయ రాఘవన్. ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకునే ఓ యువకుడి కథే ఇది. జీవితంలో ఎన్నో సాధించాలనుకునే హీరో, తన తల్లి కోరికను తీర్చాలనుకుంటాడు. ఆ క్రమంలో కొన్ని సమస్యల్లో చిక్కుకుంటాడు. వాటి నుంచి తనెలా బయటపడతాడు అనేదే ఈ చిత్రం. సమాజంలో మనకు ఎదురయ్యే రాజకీయ పరమైన ఇబ్బందులను ఎలా హ్యాండిల్ చేయాలనే సందేశం కూడా ఇస్తుంది. మారుమూల గ్రామం నుంచి సిటీవరకు జరుగుతున్న రాజకీయ నాయకుల అవినీతి, ప్రభుత్వాధికారుల చేతివాటం, బెదిరింపు రాజకీయాలు వంటి అంశాలన్నీ దర్శకుడు కళ్ళకు కట్టినట్లు చూపించాడు.ముఖ్యంగాభ్రష్టుపట్టినట్లుగా ఉన్న గవర్నమెంట్ కాలజీని హీరో శుభ్రం చేయడం, అక్కడివారిని చైతన్యవంతుల్ని చేయడం అనే అంశాలు, సన్నివేశాలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తాయి. అలాగే మదర్ సెంటిమెంట్ సీన్స్ ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతాయి. కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ అలాగే కొన్ని సన్నివేశాలలో మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు ఆనంద కృష్ణన్.. కొన్ని సీన్స్‌లో నెమ్మదిగా కనిపించారు. ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ, ఆనంద కృష్ణన్ మాత్రం వాటిని సింపుల్ గా నడిపారు. సెకండాఫ్ చాలా వరకు సినిమాటిక్‌గా సాగుతుంది. మధ్య మధ్యలో వచ్చే కొన్ని అనవసరపు సీన్స్ ప్రేక్షకులకు కాస్త బోర్ కొట్టిస్తాయి. నివాస్ కె.ప్రసన్న సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినప్పటికీ నేపథ్య సంగీతం అదిరిపోయింది. ఎన్.ఎస్. ఉదయ్‌కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఆయన ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
‘విజయ రాఘవన్’ రిలీజ్ డేట్ ఫిక్స్
‘బిచ్చగాడు, కిల్లర్’ చిత్రాల ఫేమ్ విజయ్ ఆంటోని హీరోగా నటించిన తాజా చిత్రం ‘విజయ రాఘవన్’. ఇందులో ఆత్మిక హీరోయిన్గా నటించారు. ఆనంద్ కృష్ణన్ దర్శకత్వంలో టీడీ రాజా, డీఆర్ సంజయ్‌కుమార్ నిర్మించిన ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ‘విజయ రాఘవన్ ’ చిత్రాన్ని మే 14న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా విజయ్ ఆంటోని మాట్లాడుతూ – ‘‘ఓ మాస్ ఏరియాలో పిల్లలు పక్కదారులు పట్టకుండా చదువు గొప్పతనాన్ని వారికి వివరించి, ఆ పిల్లల ఉన్నతికి పాటుపడే యువకుడి కథే ‘విజయ రాఘవన్ ’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే 14న తమిళ, తెలుగు భాషల్లో సినిమాను విడుదల చేయనున్నాం’’ అన్నారు. -
విభిన్న రాఘవన్
విభిన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు తమిళ నటుడు విజయ్ ఆంటోనీ. ఆయన నటించిన తాజా చిత్రం ‘విజయ రాఘవన్’. ఆత్మిక కథానాయిక. ఆనంద కృష్ణన్ దర్శకత్వంలో ఈ సినిమాను టి.డి. రాజా, డి.ఆర్. సంజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. న్యూ ఇయర్ స్పెషల్‌గా ఈ చిత్రం టీజర్‌ను శనివారం విడుదల చేశారు. యాక్షన్ నిండిన ఈ టీజర్ ఆకట్టుకునేలా ఉంది. ‘‘గతంలో విజయ్ ఆంటోనీ చేసిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమాకు కెమెరా: ఎన్.ఎస్. ఉదయ్ కుమార్, సహ నిర్మాతలు: కమల్ బోరా, లలితా ధనుంజయన్, బి. ప్రదీప్, పంకజ్ బోరా, ఎస్. విక్రమ్ కుమార్. -
టీకా కోసం ముమ్మర కృషి
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను అడ్డుకునే టీకాను రూపొందించే పరిశోధనల్లో భారత్‌లో దాదాపు 30 బృందాలు క్రియాశీలకంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ విజయరాఘవన్ చెప్పారు. భారీ పరిశ్రమలు, సంస్థలు, సైంటిస్ట్‌లు వేర్వేరుగా పరిశోధనలు నిర్వహిస్తున్నారన్నారు. వీటిలో సుమారు 20 పరిశోధనలు మంచి పురోగతి సాధించాయన్నారు. అవి అక్టోబర్ నాటికి క్లినికల్ ట్రయల్స్ స్థాయికి చేరే చాన్సుంది. టీకాను రూపొందించేందుకు సాధారణంగా కనీసం పదేళ్ల సమయం పడుతుందని, దాదాపు 30 కోట్ల డాలర్ల ఖర్చు అవుతుందని తెలిపారు. ప్రపంచమంతా ఇప్పుడు వ్యాక్సిన్ రూపకల్పనలో నిమగ్నమయిందని, సంవత్సరంలోపు టీకాను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. -
అనాలోచిత నిర్ణయాలతోనే ఆత్మహత్యలు
- వ్యవసాయ రంగ పరిరక్షణకు పోరాటాలే శరణ్యం - ఏఐఏడబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి విజయరాఘవన్ – ప్రారంభమైన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల ప్రతినిధుల సమావేశం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి విజయ రాఘవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 27వ మహాసభల్లో భాగంగా రావూరి గార్డెన్స్‌లో రెండోరోజు ప్రతినిధుల సభ ప్రారంభమైంది. కార్మిక సంఘం పతాకాన్ని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం మాజీ అధ్యక్షుడు పాటూరి రామయ్య ఆవిష్కరించి అమరులకు నివాళ్లర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో విజయ రాఘవన్ మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేయడాన్ని, రైతాంగ ఆత్మహత్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా అభిశంసించినా కేంద్రానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరిన రైతులపై పోలీసులు విక్షణారహితంగా కాల్పులు జరపడం సిగ్గుచేటన్నారు. ఎరువులు, విద్యుత్, నీటి సరఫరా, విద్య, వైద్యం చివరకు ఆహార భద్రత..ఇలా ఎలాంటి సబ్సిడీలు ఉండదరాని, నీతి అయోగ్ చెబుతున్న నేపథ్యంలో వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అసవరం ఆసన్నమైందన్నారు. పేదలకు భూములను పంచే భూసంస్కరణల చట్టాన్ని ప్రభుత్వాలు రివర్స్‌లో అమలు చేస్తున్నాయన్నారు. పేదలకు భూములు ఇవ్వకపోగా..వారి వద్ద ఉన్న భూములను లాక్కుంటున్నాయన్నారు. దళితులు, ఆదివాసులను హీనంగా చూస్తున్నారని, ఆవుకు ఇచ్చే గౌరవాన్ని సాటి మనసులకు ఇవ్వని ఆర్ఎస్ఎస్ లాంటి కరడుగట్టిన మతోన్మాదుల కనుసన్నల్లో నడుస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు పోరాటాలే శరణ్యమన్నారు. రాష్ట్రంలోని తెలుగు దేశం ప్రభుత్వం కూడా కేంద్రంతో పోటీ పడి రైతులు, వ్యవసాయ కార్మికుల వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రపంచ బ్యాంకుకు రాష్ట్రాన్ని ప్రయోగశాలగా మారుస్తున్నారని, ఈ విధానాలను ప్రతిఘటించాలన్నారు. అంతకముందుకు ఈ మహాసభల ప్రారంభ సభలో రవీంద్ర విద్యా సంస్థల అధినేత జి.పుల్లయ్య అధ్యక్ష ఉపన్యాసం చేశారు. మహాసభలకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 400 మంది ప్రతినిధులు హాజరయ్యారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సుబ్బారావు, వెంకటేశ్వర్లు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిరమాదేవి, కేవీపీఎస్ రాస్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, సీపీఎం నాయకులు నరసింహయ్య, కె.ప్రభాకారరెడ్డి, టి.రమేష్‌కుమార్ పాల్గొన్నారు. -
చంద్రబాబుతో ఫిక్కీ ప్రతినిధుల భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం ఫిక్కీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో డైరెక్ట్ సెల్లింగ్ పై ఫిక్కీ ప్రతినిధులు చంద్రబాబుకు నివేదిక అందజేశారు. తెలుగు రాష్ట్రాల్లో వృద్ధిరేటు పడిపోతోందని.. ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుని వృద్ధి శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఫిక్కీ బృందం ముఖ్యమంత్రికి సూచించింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి తో పాటు.. ఫిక్కీ చైర్మన్ అన్షూ భద్రాజ , ఐడీఎస్ఏ ఛైర్మన్ రజత్ బెనర్జీ లు పాల్గొన్నారు. అంతకు ముందు ఉదయం చంద్రబాబు నాయుడు బయోటెక్నాలజీ కార్యదర్శి విజయ రాఘవన్ తో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సైన్స్ అండ్ టెక్నా పరిశోధనా సెంటర్ల ఏర్పాటు పై ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో బయోటెక్నాలజీ అభివృద్ది అవకాశాలపై ఆయన తో చర్చించినట్లు తెలుస్తోంది. -
గుజరాత్ మోడల్ కు వ్యతిరేకం
వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రాఘవన్ వరంగల్: దేశమంతా ఊదరకొడుతున్న గుజరాత్ మోడల్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి విజయరాఘవన్ అన్నారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ 8వ మహాసభలు హన్మకొండలో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండో రోజు శుక్రవారం జరిగిన ప్రతినిధుల సభలో చర్చలు, తీర్మానాలను ఆయన విలేకరులకు వివరించారు. గుజరాత్లో 10 లక్షల ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా లాక్కొని కార్పొరేట్ సంస్థలకు కేటాయించారని ఆరోపించారు. వ్యతిరేకించిన రైతులను అణచివేశారని అన్నారు. దేశంలో రైతులు వ్యవసాయానికి దూరమవుతున్నారని, ఈ క్రమంలోనే వ్యవసాయ కార్మికుల సంఖ్య పెరుగుతుందన్నారు. 2001లో దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది వ్యవసాయ కార్మికులుంటే ప్రస్తుతం ఈ సంఖ్య 16 కోట్లకు చేరుకుందన్నారు. భూమిని వ్యాపారంగా మార్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ పాల్గొన్నారు.