
ప్రభు సాల్మన్, రానా, విష్ణు విశాల్
‘‘ప్రభు తెరకెక్కించిన ‘మైనా, కుంకి’ సినిమాలు బాగా నచ్చాయి. తను ‘అరణ్య’ కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. ఆయన ఇమేజినేష¯Œ , క్రియేటివిటీ నచ్చాయి. ప్రకృతిని కాపాడుకోవాలనే తన తత్వం అభినందనీయం’’ అని నిర్మాత డి.సురేష్‌బాబు అన్నారు. రానా టైటిల్ రోల్‌లో నటì ంచిన చిత్రం ‘అరణ్య’. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ తెరకెక్కించింది. హిందీలో ‘హథీ మేరే సాథి’, తమిళంలో ‘కాడన్’ పేర్లతో రూపొందింది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఏప్రిల్ 2న ఈ సినిమా విడుదలవుతోంది.
ఈ సందర్భంగా ‘అరణ్య’ టీజర్‌ను విడుదల చేశారు. డి.సురేష్ బాబు మాట్లాడుతూ– ‘‘ఇప్పటి సమాజానికి ఎంతో అవసరమైన చిత్రమిది. ప్రకృతిని ఎలా ఉపయోగించుకోవాలనే విషయం ఈ సినిమా చూస్తే తెలుస్తుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా రూపొందడానికి ముఖ్యకారణమైన వారిలో సురేష్‌బాబుగారు, ఆ తర్వాత రానాగారు. ఈ సినిమా కోసం రానా తనని తాను అరణ్యగా మార్చుకున్నారు’’ అన్నారు ప్రభు సాల్మన్. ‘‘రానా, ప్రభుసాల్మ¯Œ , విష్ణు విశాల్.. ఇలా ఎంటైర్ టీమ్ ప్యాషన్‌తో, టాలెంట్‌తో తెరకెక్కించిన సినిమా అరణ్య’’ అన్నారు ఈరోస్ ఇంటర్నేషనల్ సీఎంఓ మానవ్ సేతీ.
‘‘తెలుగులో నేను నటించిన తొలి చిత్రమిది’’ అన్నారు విష్ణు విశాల్. రానా మాట్లాడుతూ– ‘‘రెండున్నరేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డాను. అస్సాంలోని జాదవ్ ప్రియాంక్ అనే వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా చేశాం. పద్మశ్రీ అవార్డ్ పొందిన ఈయన 1300 ఎకరాల అడవిని నాటాడు. ‘అరణ్య’ సినిమా చేయడం వల్ల జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను. కథ విని పాత్రను అర్థం చేసుకోవడానికి నాకు ఆరు నెలలు పట్టింది. ఇలాంటి సినిమా ఇచ్చిన ప్రభుగారికి రుణపడి ఉంటాను. పర్యావరణంలో మనం ఒక భాగం అని చెప్పే సినిమా ఇది’’ అన్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ హెడ్ నందు అహుజా మాట్లాడారు.