‘ఏ జర్నీ టు కాశీ చిత్రం చాలా అరుదైనది. ప్రతి నటుడికి ఇలాంటి చిత్రం ఒకటి పడాలి. నేను ఇలాంటి చిత్రం చేయటం చాలా గొప్ప గా భావిస్తున్నాను’ అని హీరో చైతన్య రావు అన్నారు. చైతన్య రావు, అలెగ్జాండర్ సాల్నికోవ్ , ప్రియా పాల్వాయి, ఖ్యాతిలీన్ గౌడ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఏ జర్నీ టు కాశీ’. ముని కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వారణాసి క్రియేషన్స్ పతాకం పై దొరడ్ల బాలాజీ , శ్రీధర్ వారణాసి సంయుక్తంగా నిర్మించారు. డిసెంబర్ 17న విడుదల కాబోతున్న ఈ మూవీ ట్రైలర్‌ని తాజాగా విడుదల చేశారు మేకర్స్.
ఈ సందర్భంగా హీరో చైతన్య రావు మాట్లాడుతూ.. ఈ చిత్రం చాలా రియలిస్టిక్ గా నాచురల్ గా ఉంటుంది. మా చిత్రం పనోరమా ఫిలిం ఫెస్టివల్ లో టాప్ 25 లిస్ట్ లో నిలిచింది. కోలీవుడ్ ఫిలిం ఫెస్టివల్ లో విన్నర్ గా నిలిచింది. అందరికి ఈ చిత్రం నచ్చుతుంది’ అని అన్నారు.
‘ఈ చిత్రం లో అందమైన ప్రేమకథ కూడా ఉంది. తెలుగు ప్రేక్షకులందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది’అని హీరోయిన్ ఖ్యాతిలీన్ గౌడ అన్నారు. ‘ఇది ఒక రోడ్ జర్నీ కథ. కాశీ యాత్ర వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పు తీసుకువచ్చిందో తెలుసుకోవాలి అంటే మా చిత్రాన్ని చూడండి’ అని దర్శకుడు ముని కృష్ణ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment