చైతన్య రావు, అలెగ్జాండర్ సాల్నికోవ్ , ప్రియా పాల్వాయి, ఖ్యాతిలీన్ గౌడ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఏ జర్నీ టు కాశీ’. ముని కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వారణాసి క్రియేషన్స్ పతాకం పై దొరడ్ల బాలాజీ , శ్రీధర్ వారణాసి సంయుక్తంగా నిర్మించారు. జనవరి 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన దర్శకుడు శేఖర్ సూరి మాట్లాడుతూ.. "ఏ జర్నీ టు కాశీ’ ట్రైలర్ చూసాను. చాలా బాగుంది. దర్శకుడి ఉద్దేశం అద్భుతంగా ఉంది అనిపించింది. నేటి కాలంలో మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఇలాంటి కథలను అందరూ ఆదరించాలి’అన్నారు. ‘మంచి చిత్రంతో వస్తున్నాం. అందరూ చూసి మా చిత్రాన్ని హిట్ చేయండి’ అని నిర్మాత దొరడ్ల బాలాజీ కోరారు.
‘ఇది ఒక ఫీల్ గుడ్ సినిమా. ఫామిలీ అందరు కలిసి చూసేలా ఉంటుంది’ అని హీరోయిన్ కేటలిన్ అన్నారు. కాశీ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన ఓ కుటుంబ కథ ఇది. చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుంది. అందరూ చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను’అని దర్శకుడు మునికృష్ణ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment