A Journey To Kashi Movie
-
A Journey To Kashi: మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి
చైతన్య రావు, అలెగ్జాండర్ సాల్నికోవ్ , ప్రియా పాల్వాయి, ఖ్యాతిలీన్ గౌడ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఏ జర్నీ టు కాశీ’. ముని కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వారణాసి క్రియేషన్స్ పతాకం పై దొరడ్ల బాలాజీ , శ్రీధర్ వారణాసి సంయుక్తంగా నిర్మించారు. జనవరి 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన దర్శకుడు శేఖర్ సూరి మాట్లాడుతూ.. "ఏ జర్నీ టు కాశీ’ ట్రైలర్ చూసాను. చాలా బాగుంది. దర్శకుడి ఉద్దేశం అద్భుతంగా ఉంది అనిపించింది. నేటి కాలంలో మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఇలాంటి కథలను అందరూ ఆదరించాలి’అన్నారు. ‘మంచి చిత్రంతో వస్తున్నాం. అందరూ చూసి మా చిత్రాన్ని హిట్ చేయండి’ అని నిర్మాత దొరడ్ల బాలాజీ కోరారు. ‘ఇది ఒక ఫీల్ గుడ్ సినిమా. ఫామిలీ అందరు కలిసి చూసేలా ఉంటుంది’ అని హీరోయిన్ కేటలిన్ అన్నారు. కాశీ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన ఓ కుటుంబ కథ ఇది. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అందరూ చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను’అని దర్శకుడు మునికృష్ణ అన్నారు. -
న్యూ ఇయర్.. ఫస్ట్ వీక్‌లో ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే
సంక్రాంతి సీజన్.. టాలీవుడ్‌కి చాలా ప్రత్యేకం. ఈ పండగకి సినిమాను విడుదల చేస్తే టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్స్ వస్తాయి. అందుకే ప్రతి ఏడాది సంక్రాంతి బరిలో బడా సినిమాలు ఉంటాయి. ఈ సంక్రాంతికి కూడా బరిలో బాలయ్య ‘వీరసింహారెడ్డి’, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలు ఉన్నాయి. అయితే అంతకుముందే జనవరి మొదటివారం సినీ ప్రియులను అలరించడానికి కొన్ని చిన్న చిత్రాలు రాబోతున్నాయి. జనవరి 6న విడుదయ్యే ఈ చిన్న చిత్రాలతో పాటు ఈ వారం ఓటీటీలో అలరించబోయే సినిమాలు,వెబ్ సిరీస్‌పై ఓ లుక్కేయండి. ఈ వారం థియేటర్స్‌లో విడుదలయ్యే చిత్రాలు దోస్తాన్- జనవరి 6 మైఖేల్ గ్యాంగ్- జనవరి 6 ప్రత్యర్థి- జనవరి 6 ఎ జర్నీ టు కాశీ- జనవరి 6 వీర గున్నమ్మ- జనవరి 6 కింగ్డమ్ ఆఫ్ ది డైనోసార్స్- జనవరి 6 ఓటీటీలో వస్తోన్న సినిమాలు, సిరీస్‌లివే.. నెట్‌ఫ్లిక్స్ ♦ హౌ బి కేమ్ ఏ గ్యాంగ్‌స్టర్ (వెబ్ సిరీస్)- జనవరి 4 ♦ ద లైయింగ్ లైఫ్ ఆఫ్ అడల్ట్స్(ఇటాలియన్ వెబ్ సిరీస్) – జనవరి 4 ♦ జిన్నీ అండ్ జార్జియా (వెబ్ సిరీస్)- జనవరి 5 ♦ కోపెన్ హాగన్ కౌబాయ్ (డానిష్ సినిమా) – జనవరి 5 ♦ ఉమెన్ ఆఫ్ ది డెడ్ (హాలీవుడ్)- జనవరి 6 ♦ పోలీస్‌వర్సెస్ అండర్ వరల్డ్ (హిందీ)- జనవరి 6 ♦ పేల్ బ్లూ ఐ (హాలీవుడ్)- జనవరి 6 అమెజాన్ ప్రైమ్ వీడియో ♦ ఫోన్ బూత్ (హిందీ మూవీ) – జనవరి 2 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ♦ తాజా ఖబర్ (హిందీ)- జనవరి 6 జీ5 ♦ ఊంచాయి (హిందీ-) జనవరి 6 ♦ షికాపుర్ (బెంగాలీ సిరీస్) – జనవరి 6 ♦ బేబ్ భంగ్డా పౌండే (పంజాబీ మూవీ) – జనవరి 6 ఆహా ♦ అన్‌స్టాపబుల్ 2 విత్ ఎన్బీకే: బాహుబలి 2 ఎపిసోడ్- జనవరి 6 ♦ కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ ఐదో ఎపిసోడ్- జనవరి 6 ♦ స్కూల్ 2017(కొరియన్ షో)- జనవరి 7 సోనీలివ్ ♦ ఫాంటసీ ఐలాండ్ (సీజన్ 2 ) – జనవరి 3 ♦ నవంబర్ 13 (హిందీ సిరీస్) – జనవరి 3 ♦ సౌదీవెళ్లక్క (మలయాళ సినిమా) – జనవరి 6 -
‘ఏ జర్నీ టు కాశీ’ అరుదైన సినిమా: చైతన్య రావు
‘ఏ జర్నీ టు కాశీ చిత్రం చాలా అరుదైనది. ప్రతి నటుడికి ఇలాంటి చిత్రం ఒకటి పడాలి. నేను ఇలాంటి చిత్రం చేయటం చాలా గొప్ప గా భావిస్తున్నాను’ అని హీరో చైతన్య రావు అన్నారు. చైతన్య రావు, అలెగ్జాండర్ సాల్నికోవ్ , ప్రియా పాల్వాయి, ఖ్యాతిలీన్ గౌడ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఏ జర్నీ టు కాశీ’. ముని కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వారణాసి క్రియేషన్స్ పతాకం పై దొరడ్ల బాలాజీ , శ్రీధర్ వారణాసి సంయుక్తంగా నిర్మించారు. డిసెంబర్ 17న విడుదల కాబోతున్న ఈ మూవీ ట్రైలర్‌ని తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా హీరో చైతన్య రావు మాట్లాడుతూ.. ఈ చిత్రం చాలా రియలిస్టిక్ గా నాచురల్ గా ఉంటుంది. మా చిత్రం పనోరమా ఫిలిం ఫెస్టివల్ లో టాప్ 25 లిస్ట్ లో నిలిచింది. కోలీవుడ్ ఫిలిం ఫెస్టివల్ లో విన్నర్ గా నిలిచింది. అందరికి ఈ చిత్రం నచ్చుతుంది’ అని అన్నారు. ‘ఈ చిత్రం లో అందమైన ప్రేమకథ కూడా ఉంది. తెలుగు ప్రేక్షకులందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది’అని హీరోయిన్ ఖ్యాతిలీన్ గౌడ అన్నారు. ‘ఇది ఒక రోడ్ జర్నీ కథ. కాశీ యాత్ర వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పు తీసుకువచ్చిందో తెలుసుకోవాలి అంటే మా చిత్రాన్ని చూడండి’ అని దర్శకుడు ముని కృష్ణ అన్నారు.